Telugu Global
National

సిలిండ్రెల్లా మిస్సింగ్.. స్మృతి ఇరానీపై పేలుతున్న జోకులు..

కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వకుండా గ్యాస్ సిలిండర్ రేట్లను ఏకంగా 50రూపాయలు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ రేట్లను ఒకటీ రెండు రూపాయలు తగ్గించగానే గొప్పగా ప్రచారం చేసుకునే నేతలు.. నిస్సిగ్గుగా 50రూపాయలు పెంచి సైలెంట్ గా కూర్చున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ భారం పెంచడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఢిల్లీలో మాత్రం వీధి వీధినా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బ్యానర్లు వెలిశాయి. స్మృతి ఇరానీకి సంబంధం ఏంటి..? స్మృతి ఇరానీ మహిళా, శిశు అభివృద్ధి […]

సిలిండ్రెల్లా మిస్సింగ్.. స్మృతి ఇరానీపై పేలుతున్న జోకులు..
X

కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వకుండా గ్యాస్ సిలిండర్ రేట్లను ఏకంగా 50రూపాయలు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ రేట్లను ఒకటీ రెండు రూపాయలు తగ్గించగానే గొప్పగా ప్రచారం చేసుకునే నేతలు.. నిస్సిగ్గుగా 50రూపాయలు పెంచి సైలెంట్ గా కూర్చున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ భారం పెంచడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఢిల్లీలో మాత్రం వీధి వీధినా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బ్యానర్లు వెలిశాయి.

స్మృతి ఇరానీకి సంబంధం ఏంటి..?

స్మృతి ఇరానీ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు మంత్రి. ఆమెకు గ్యాస్ రేట్లు పెరగడానికి సంబంధం లేదు. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ రేట్లు పెంచినప్పుడల్లా ఆమె సోషల్ మీడియాలో టార్గెట్ అవుతున్నారు. దానికి కారణం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ తరఫున ఆమె చేసిన ఆందోళన.

2014లో కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు 410 రూపాయలు. ఎన్డీఏ వచ్చాక ఈ ఎనిమిదేళ్లలో దాని రేటు 1053 రూపాయలకు చేరింది. అప్పట్లో 410 రూపాయల ధరకే రోడ్లపైకి వచ్చి స్మృతి ఇరానీ ఓ రేంజ్ లో కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు.

అసలు మధ్యతరగతి ఎలా బతకాలంటూ నిలదీశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా ప్రజలపై బండలు వేస్తోంది. కానీ ఇప్పుడు స్మృతి కాదు కదా ఎవరూ నోరు మెదపడంలేదు. కనీసం గ్యాస్ రేట్లు పెరగడంపై స్పందించడానికి కూడా నేతలు ముందుకు రావడంలేదు.

అప్పట్లో అంత హడావిడి చేసిన స్మృతి ఇరానీ, ఇప్పుడు కనీసం గ్యాస్ రేట్లపై ఎందుకు స్పందించడంలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు మరో అడుగు ముందుకేసి ఢిల్లీలో సిలిండ్రెల్లా అంటూ స్మృతి ఇరానీ ఫొటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు వేశారు.

ఆమె ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. ‘ఎ ఫెయిరీ గ్యాస్ స్టోరీ’, ‘ఓన్లీ ఆన్ నెట్‌ఫ్లిక్స్’, ‘ప్రొడ్యూస్డ్ బై బీజేపీ’, అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అప్పట్లో స్మృతి చేసిన ఆందోళన ఫొటోలను ఇప్పుడు తెరపైకి తెస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘వేర్ ఈజ్ సిలిండ్రెల్లా’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

First Published:  7 July 2022 9:31 AM GMT
Next Story