Telugu Global
MOVIE UPDATES

లైగర్ మ్యూజికల్ ఫెస్ట్.. ఫస్ట్ సింగిల్ రెడీ

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా లైగర్. సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. తాజాగా చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘లైగర్’ ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ ప్రోమోని జూలై 8న విడుదల చేసి, పూర్తి పాటని 11న రిలీజ్ చేయనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ తన చేత్తో అనన్య […]

లైగర్ మ్యూజికల్ ఫెస్ట్.. ఫస్ట్ సింగిల్ రెడీ
X

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా లైగర్. సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. తాజాగా చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘లైగర్’ ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ ప్రోమోని జూలై 8న విడుదల చేసి, పూర్తి పాటని 11న రిలీజ్ చేయనున్నారు.

అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ తన చేత్తో అనన్య చేత విజల్ కొట్టించేలా చూపించారు. ఇదొక పార్టీ సాంగ్. ఫుల్ జోష్ తో ఉండబోతోంది ఈ పాట. పబ్ సెట్‌లో ఈ పాట షూట్ చేశారు.

లిజో జార్జ్-డిజె చేతాస్ ఈ పాటను కంపోజ్ చేశారు. తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. తెలుగుతో పాటు.. హిందీ, తమిళ్, మలయాళ వెర్షన్లను ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

First Published:  7 July 2022 12:30 AM GMT
Next Story