Telugu Global
National

కోల్‌కతా పోలీసుల కంట్లో నలుసులా నూపుర్ శర్మ

ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన నూపుర్ శర్మ ఎక్కడుందో ఎవరికీ తెలియడం లేదు. అసలు ఆమె దేశంలోనే ఉందా లేక దేశం విడిచి పోయిందా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తమ ఎదుట హాజరు కావాలని కోల్ కతా పోలీసులు ఆమెకు నోటీసులు, సమన్లు జారీ చేసీ చేసీ అలసిపోయారు. లోగడ రెండుసార్లు నోటీసులు పంపినా వాటికీ సమాధానం లేదు. తనకు భద్రత లేదని, అందువల్ల ఇప్పట్లో మీముందు హాజరు కాలేనని […]

Nupur Sharma
X

ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన నూపుర్ శర్మ ఎక్కడుందో ఎవరికీ తెలియడం లేదు. అసలు ఆమె దేశంలోనే ఉందా లేక దేశం విడిచి పోయిందా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తమ ఎదుట హాజరు కావాలని కోల్ కతా పోలీసులు ఆమెకు నోటీసులు, సమన్లు జారీ చేసీ చేసీ అలసిపోయారు. లోగడ రెండుసార్లు నోటీసులు పంపినా వాటికీ సమాధానం లేదు. తనకు భద్రత లేదని, అందువల్ల ఇప్పట్లో మీముందు హాజరు కాలేనని ఒకసారి.. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా రాలేనని మరోసారి.. ఇలా రకరకాల సాకులు చెప్పి నూపుర్.. మొత్తానికి పోలీసులకే సవాలు విసురుతూ వచ్చింది.

మూడోసారి నోటీసు పంపితే తనకు నాలుగు వారాల వ్యవధినివ్వాలని, తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆమె వాళ్లకు ఈ-మెయిల్ లేఖ పంపింది. ఇప్పుడు తాజాగా.. ఇక సమయం వేస్ట్ చేయవద్దని, ఈ నెల 11 న ఎలాగైనా తమ స్టేషన్ కి రావాలని ఆమెను నగర పోలీసులు ప్రాధేయపడుతున్నారు. ఆమె మీద ఎవరైనా దాడి చేస్తారని మేం అనుకోవడం లేదు.. సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుతున్నాం అని ఓ పోలీసు అధికారి చెప్పారు. అసలు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినా వాటికీ దిక్కులేకుండా పోయిందని ఆయన నిట్టూర్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో పోలీసు స్టేషన్లలో నూపుర్ పై కేసులు దాఖలై ఉన్నాయి. ముంబై నుంచి స్వయంగా పోలీసులు కోల్ కతా సిటీకి వచ్చి ఆమెకోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

నూపుర్ ను అరెస్టు చేయాల్సిందే.. మమతా బెనర్జీ
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రేపిన నూపుర్ శర్మను అరెస్టు చేయాలని స్వయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హూంకరించారు. పైగా దేశ అత్యున్నత న్యాయస్థానమే ఆమెను తీవ్రంగా తప్పు పట్టిందని, ఆమె విషయంలో బీజేపీ ఏదో దాస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని దీదీ మండిపడ్డారు. ప్రజలను చీల్చాలని చూసే వారిపట్ల కఠినంగా వ్యవహరించవలసిందేనన్నారు, గతంలో కూడా ఫేక్ వీడియోలతో మత ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. వీటిని తాము సహించే ప్రసక్తే లేదన్నారు. నూపుర్ కామెంట్స్ ని ఖండిస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది కూడా.. ఆమె కోసం ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు.

అయితే ఆమెనుద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు, సాయుధ దళాల్లోని 25 మంది మాజీ ఆఫీసర్లు మండిపడడం ఆశ్చర్యకరం. వీరంతా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాసిన లేఖలో.. ఈ కేసు పట్ల కోర్టు వివక్ష చూపుతోందని ఆరోపించారు. నూపుర్ లూజ్ టంగ్ అల్లర్లకు కారణమని వ్యాఖ్యానించడమేమిటని ప్రశ్నించారు. మొత్తం 117 మంది ఈ లేఖపై సంతకాలు చేశారు.

First Published:  7 July 2022 7:22 AM GMT
Next Story