Telugu Global
National

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ కు షాక్..110 యేళ్ళ చరిత్రలో తొలిసారి ఇలా!

గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ నేడు క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. వ‌రుసగా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన కాంగ్రెస్ ప‌లు రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయింది. తిరిగి పూర్వ వైభ‌వం పొందేందుకు పెనుగులాడుతోంది. అతి పెద్ద రాష్ట్రం అయిన‌ ఉత్త‌రప్ర‌దేశ్ అంసెబ్లీ ఎన్నిక‌ల్లోనూ రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మ‌రో దారుణ ప‌రిస్థితి ఎదురైంది. రాష్ట్ర శాస‌న మండ‌లిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కోల్పోయింది. 110 ఏళ్ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లి చ‌రిత్ర‌లో […]

Congress
X

గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ నేడు క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. వ‌రుసగా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన కాంగ్రెస్ ప‌లు రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయింది. తిరిగి పూర్వ వైభ‌వం పొందేందుకు పెనుగులాడుతోంది. అతి పెద్ద రాష్ట్రం అయిన‌ ఉత్త‌రప్ర‌దేశ్ అంసెబ్లీ ఎన్నిక‌ల్లోనూ రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మ‌రో దారుణ ప‌రిస్థితి ఎదురైంది.

రాష్ట్ర శాస‌న మండ‌లిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కోల్పోయింది. 110 ఏళ్ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లి చ‌రిత్ర‌లో కాంగ్రెస్‌కు ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. యూపీ శాస‌న మండ‌లిలో కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుతం ఏకైక స‌భ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ దీపిక్ సింగ్ ప‌దవీకాలం బుధ‌వారంతో ముగిసింది. ఆయ‌న‌తో పాటు 11 మంది ఎమ్మెల్సీలు కూడా త‌మ ప‌దవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.

1887లో యూపీ శాస‌న మండ‌లి ఏర్పాటైంది. 1909లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ త‌ర‌ఫున తొలి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆ త‌ర్వాత యూపీలో పలుసార్లు అధికారంలోకి వ‌చ్చింది. అలాగే మెజారిటీ పార్ల‌మెంటు సీట్లను కూడా కూడా గెలుచుకుంది. కానీ, గ‌త రెండు ప‌ర్యాయాలు అసెంబ్లీతో పాటు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్‌కు దారుణ‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. మార్చినెల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం రెండు సీట్లు మాత్ర‌మే గెలుచుకుని దాదాపు ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. ఆఖ‌రికి శాస‌న మండ‌లిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేని దుస్థితిలో కాంగ్రెస్ మిగిలిపోవ‌డం ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా భావించే కాంగ్రెస్ నాయకుడు దీప‌క్ సింగ్‌. “నేను చరిత్రను నమ్ముతాను. ఖ‌చ్చితంగా చరిత్ర పునరావృతమవుతుంది” అని అన్నారు.1920లో స్వాతంత్ర్యానికి పూర్వం మోతీలాల్ నెహ్రూ రాజీనామా చేసినప్పుడు విధానసభలో కాంగ్రెస్‌కు ప్రతినిధులెవరూ లేరని సింగ్ గుర్తు చేశారు. “కానీ కాంగ్రెస్ మన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. ఇవాళ మళ్లీ కాంగ్రెస్ సభలో లేదు, నేటి ప్రభుత్వం బ్రిటీష్ వారిదే’ అని సింగ్ వ్యాఖ్యానించారు.

“బీజేపీ ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోంది. దేశాన్ని లూటీ చేస్తోంది. ప్రైవేట్ వ్యాపార సంస్థలకు మాత్రమే ప్రాముఖ్యం ఇస్తోంది. . బ్రిటీష్ వారు దేశం విడిచి వెళ్ళిన‌ట్టుగానే బిజెపి ప్రభుత్వం కూడా అధికారంలో నుంచి వెళ్ళిపోక త‌ప్ప‌ద‌ని దీప‌క్‌ సింగ్ బీజేపీపై విరుచుకుపడ్డారు.

First Published:  7 July 2022 12:18 AM GMT
Next Story