Telugu Global
MOVIE UPDATES

మరో 2 రోజుల్లో ‘ఘోస్ట్’ ఫస్ట్ విజువల్స్

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ది ఘోస్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా సినిమా మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ బ్లాక్ త్వరలో షూట్ చేసి ప్రొడక్షన్ పార్ట్ పూర్తిచేస్తారు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారు. ఈ గ్యాప్ లో సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. జులై 9న విడుదల కానున్న ఫస్ట్ విజువల్ తో ప్రేక్షకులని థ్రిల్ చేయడనికి సిద్ధమైంది […]

మరో 2 రోజుల్లో ‘ఘోస్ట్’ ఫస్ట్ విజువల్స్
X

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ది ఘోస్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా సినిమా మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ బ్లాక్ త్వరలో షూట్ చేసి ప్రొడక్షన్ పార్ట్ పూర్తిచేస్తారు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారు. ఈ గ్యాప్ లో సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు.

జులై 9న విడుదల కానున్న ఫస్ట్ విజువల్ తో ప్రేక్షకులని థ్రిల్ చేయడనికి సిద్ధమైంది ఘోస్ట్. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘కిల్లింగ్ మెషీన్’ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే ఫస్ట్ విజువల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతోందని అర్ధమౌతుంది. పోస్టర్లో నాగార్జున రెండు చేతులతో కత్తి పట్టుకుని టెర్రిఫిక్ గా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో చంద్రుడు ఎరుపెక్కి ఉండటం ఆసక్తికరంగా ఉంది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున తొలిసారిగా ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించాలి. కానీ గర్భం దాల్చడంతో ఆమె తప్పుకుంది. ఆ స్థానంలో సోనాల్ చౌహాన్ వచ్చింది.

శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్-సౌరభ్ సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. బంగార్రాజు తర్వాత నాగ్ నుంచి వస్తున్న సినిమా ఇదే.

First Published:  7 July 2022 6:19 AM GMT
Next Story