Telugu Global
National

సమరానికి ఛాన్స్ లేదు.. సంధి తప్పేలా లేదు

శివసేన అధినేత ఎవరు..? ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలలో 40మందిని తనవైపు తిప్పుకున్న సీఎం ఏక్ నాథ్ శిండే శివసేన అధినేతా..? కేవలం 16మంది సపోర్ట్ ఉన్న ఉద్ధవ్ ఠాక్రేని పార్టీ అధినేతగా గుర్తించాలా..? రోజు రోజుకీ పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీపై ఉద్ధవ్ ఠాక్రే పట్టు కోల్పోతున్నారు. నాయకులంతా శిండే వర్గంలో చేరుతున్నారు. చివరకు ఉద్ధవ్ ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే మాత్రమే శివసేనలో మిగిలిపోయేలా ఉంది పరిస్థితి. మిగతా నాయకులంతా ఏక్ నాథ్ శిండేతో చేరి […]

Uddhav Thackeray
X

శివసేన అధినేత ఎవరు..? ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలలో 40మందిని తనవైపు తిప్పుకున్న సీఎం ఏక్ నాథ్ శిండే శివసేన అధినేతా..? కేవలం 16మంది సపోర్ట్ ఉన్న ఉద్ధవ్ ఠాక్రేని పార్టీ అధినేతగా గుర్తించాలా..? రోజు రోజుకీ పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీపై ఉద్ధవ్ ఠాక్రే పట్టు కోల్పోతున్నారు. నాయకులంతా శిండే వర్గంలో చేరుతున్నారు. చివరకు ఉద్ధవ్ ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే మాత్రమే శివసేనలో మిగిలిపోయేలా ఉంది పరిస్థితి. మిగతా నాయకులంతా ఏక్ నాథ్ శిండేతో చేరి తమదే అసలైన శివసేన అని ప్రకటించేస్తున్నారు. సీఎం కుర్చీయే కాదు, శివసేనపై పెత్తనం కూడా ఏక్ నాథ్ శిండేకే దఖలుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మెజార్టీ ఎమ్మల్యేలు ఏక్ నాథ్ శిండే వర్గంలో చేరి ప్రభుత్వంలో కీలక భాగస్వాములయ్యారు. 18మంది ఎంపీలలో 12మంది ఆల్రడీ శిండేతో టచ్ లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ప్లేటు ఫిరాయించాల్సిన అవసరం లేకపోవడంతో మిగతా ఆరుగురు వేచి చూస్తున్నారు కానీ, లేకపోతే కచ్చితంగా శిండేకి జై కొట్టేవారు. ఈ దశలో ఉద్ధవ్ భవిష్యత్ రాజకీయం ఏంటనేది ఆసక్తిగా మారింది. శిండేతో పోరాడే శక్తి, యుక్తి ఆయనకు లేవని తేలిపోయింది. ఇక సమరం చేయలేరు కాబట్టి సంధి మాత్రమే ఆయన ముందున్న ఏకైక ఆప్షన్.

తాజాగా థాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌కు (TMC)కి చెందిన 66మంది శివసేన కార్పొరేటర్లు శిండే గూటికి చేరిపోయారు. ఆయనకు పూర్తి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఉద్ధవ్‌ వర్గంలో కేవలం ఒక్క కార్పొరేటర్‌ మాత్రమే మిగిలి ఉన్నట్లయింది. మహారాష్ట్రలో ముంబై తర్వాత అంతటి కీలకమైన కార్పొరేషన్ థానే. అక్కడ ఇప్పుడు ఉద్ధవ్ తన పట్టు కోల్పోయారు. వాస్తవానికి థానే కార్పొరేషన్ పదవీకాలం ముగిసినా.. ఓబీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉండటంతో ఎన్నికలు ఆగిపోయాయి. ఈ సమయంలో కార్పొరేటర్లంతా శిండే వర్గంలో చేరిపోవడం విశేషం. ఇది కేవలం థానేకే పరిమితం అయ్యేలా లేదు. మిగతా ప్రాంతాల్లో కూడా కీలక నేతలంతా శిండే గ్రూపుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలంతా వారి స్థానిక నియోజకవర్గాల్లో కేడర్ ని శిండేకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

ఉద్ధవ్ ఆప్షన్ ఏంటి..?

పార్టీ నాది, జెండా నాది అని ఉద్ధవ్ ఎదురు తిరిగితే కుదిరేలా లేదు. సీఎం కుర్చీపై ఆశలు వదిలేసుకున్నా.. కనీసం పార్టీపై పెత్తనం కొనసాగించాలంటే శిండే గ్రూప్ తో ఉద్ధవ్ రాజీ చేసుకోక తప్పేలా లేదు. ఇంకా కాంగ్రెస్, ఎన్సీపీ, మహా వికాస్ అఘాడీ అంటూ లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఉద్ధవ్ ఏకాకిగా మిగలడం ఖాయం.

First Published:  7 July 2022 8:12 AM GMT
Next Story