Telugu Global
NEWS

బడులేమైనా ఎడ్లబండ్లా..? తోపుడుబండ్లా..? మాయమవడానికి

ఏపీలో విలీనం పేరుతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని వివరించారాయన. ఏపీలో బడులు మాయం అంటూ ఓ వర్గం మీడియా కట్టుకథలు అల్లుతోందన్నారు బొత్స. మాయమైపోడానికి బడులేమైనా ఎడ్ల బండ్లా, తోపుడు బండ్లా..? అంటూ ఆగ్రహం […]

బడులేమైనా ఎడ్లబండ్లా..? తోపుడుబండ్లా..? మాయమవడానికి
X

ఏపీలో విలీనం పేరుతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని వివరించారాయన. ఏపీలో బడులు మాయం అంటూ ఓ వర్గం మీడియా కట్టుకథలు అల్లుతోందన్నారు బొత్స. మాయమైపోడానికి బడులేమైనా ఎడ్ల బండ్లా, తోపుడు బండ్లా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు బొత్స.

అమ్మ ఒడి పథకాన్ని పనికి మాలినది అని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు బొత్స. అమ్మఒడి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని చంద్రబాబుకి కడుపుమంటగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రస్తుతం 42,750 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, 5,200 స్కూళ్లను మ్యాపింగ్ చేశామని, రెండు కిలో మీటర్ల రేడియస్‌ పరిధిలో దాదాపు 200 స్కూళ్లు ఉన్నాయని తెలిపారు.. ఒక క్లాస్ కు ఒక టీచర్ అనే విధానం కాకుండా, కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌ కు ఒక టీచర్ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని చెప్పారు బొత్స.

ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాసిందని, ఏపీలో ఎక్కడ ఏ స్కూల్ మూతపడిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బడి ఎక్కడ మాయమైందో రామోజీరావు చెప్పాలన్నారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే వారికి ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. కేరళ, గుజరాత్‌కు ధీటుగా ఇక్కడి విద్యార్థులు నిలబడాలని ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు విద్యాకానుకలో ఉన్న వస్తువులను ఎప్పుడు ఎవరికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. బైజూస్ తో ఒప్పందం చేసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లోని 40 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు బొత్స.

First Published:  7 July 2022 7:38 AM GMT
Next Story