Telugu Global
NEWS

హైదరాబాద్‌లో కోడి పందాలు.. పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని

హైదరాబాద్ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు ప‌టాన్‌చెర్వు ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప‌టాన్‌చెర్వు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోడి పందాలు జరుగుతున్న ప్రాంతంలో దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు 70 మంది అక్కడ కోడి పందాల్లో పాల్గొని పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, దాడి చేసే సమయానికి 70 మందిలో 49 మంది […]

హైదరాబాద్‌లో కోడి పందాలు.. పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని
X

హైదరాబాద్ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు ప‌టాన్‌చెర్వు ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప‌టాన్‌చెర్వు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోడి పందాలు జరుగుతున్న ప్రాంతంలో దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు 70 మంది అక్కడ కోడి పందాల్లో పాల్గొని పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, దాడి చేసే సమయానికి 70 మందిలో 49 మంది పరారయ్యారు. మిగిలిన 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప‌టాన్‌చెర్వు సమీపంలోని పెదకంజర్ల గ్రామంలోని ఒక తోటలో గత కొన్నాళ్లుగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో ఈ పందాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన ప్రధాన నిర్వాహకుడిగా పోలీసులు తేల్చారు. అతడికి అక్కినేని సతీష్, బర్ల శ్రీనులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తోటలోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకున్న చింతమనేని ప్రభాకర్‌తో పాటు కృష్ణంరాజు అనే వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. వారిద్దరే ప్రధాన నిర్వాహకులని పట్టుబడిన వాళ్లు చెప్పారు. పారిపోయిన వాళ్లలో కొంతమంది వీఐపీలు కూడా ఉన్నారని తెలుస్తున్నది. ప్రస్తుతం పరారైన వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతర చోట్ల కూడా డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.

కాగా, పోలీసుల దాడిలో కోడి పందాలు నిర్వహిస్తున్న వారి దగ్గర నుంచి రూ. 13.12 లక్షల నగదు, 32 పందెం కోళ్లతో పాటు 26 కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని సహా పరారీలో ఉన్న మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

First Published:  6 July 2022 9:33 PM GMT
Next Story