Telugu Global
National

తమిళనాడును రెండు ‘ముక్కలు’ చేయండి .. బీజేపీ

తమిళనాడును రెండు రాష్ట్రాలుగా విభజించాలని రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు. పాలక డీఎంకేకి వ్యతిరేకంగా దక్షిణ తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇలా చేస్తే కేంద్ర పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చ‌న్నారు. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో మనకు మరిన్ని నిధులు వస్తాయన్నారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని, లేకపోతే ప్రత్యేక తమిళనాడు దేశం కోసం తాము మళ్ళీ పోరాడవలసి వస్తుందంటూ డీఎంకే ఎంపీ ఏ. […]

తమిళనాడును రెండు ‘ముక్కలు’ చేయండి .. బీజేపీ
X

తమిళనాడును రెండు రాష్ట్రాలుగా విభజించాలని రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు. పాలక డీఎంకేకి వ్యతిరేకంగా దక్షిణ తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇలా చేస్తే కేంద్ర పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చ‌న్నారు. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో మనకు మరిన్ని నిధులు వస్తాయన్నారు.

రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని, లేకపోతే ప్రత్యేక తమిళనాడు దేశం కోసం తాము మళ్ళీ పోరాడవలసి వస్తుందంటూ డీఎంకే ఎంపీ ఏ. రాజా ఇటీవల కేంద్రాన్ని హెచ్చరించిన నేపథ్యంలో నాగేంద్రన్ కూడా ఈ కొత్త కోర్కెను తెరపైకి తెచ్చారు. సీఎం స్టాలిన్ సమక్షంలోనే రాజా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మా ముఖ్యమంత్రి ‘అన్నా’ అడుగుజాడల్లో నడుస్తున్నారని, కానీ ఆయనను ‘పెరియార్’ బాటలో నడిచేట్టు చేయవద్దని రాజా.. ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు. సెపరేట్ నేషన్ కోసం మేం డిమాండ్ చేసేలా చూడకండి.. మా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తినివ్వండి.. అంతవరకు మేం విశ్రమించేది లేదు అని ఆయన తీవ్రంగానే కోరారు.

ఇప్పుడు నైనార్ నాగేంద్రన్.. మళ్ళీ కొత్తగా ‘పుండును ‘ కెలికారు. తమిళనాడును రెండుగా చీల్చాలని, అప్పుడు అది కేంద్రానికి, ఈ ‘ముక్కలకు’ కూడా ఉభయతారకంగా ఉంటుందన్నారు. ఈ రాష్ట అసెంబ్లీలో 234 సీట్లున్నాయి. (రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాలున్నాయి). రాష్ట్ర విభజన కోసం ఇప్పుడు ప్రజా ఉద్యమమేమీ లేదు.

పైగా అసెంబ్లీలో బీజేపీ సభ్యులు నలుగురు మాత్రమే ఉన్నారు. విభజన జరిగితే అది పార్టీని ఇబ్బందుల్లో నెడుతుందని డీఎంకే వర్గాలు అంటున్నాయి. రాష్ట్రం రెండుగా చీలిన పక్షంలో బీజేపీకి ఇప్పుడున్న నాలుగు సీట్లు కూడా దక్కకుండా పోతాయని, వాళ్ళను విసిరి పారేయడమే జరుగుతుందని డీఎంకే అధికారప్రతినిధి టీకెఎస్.ఇలంగోవన్ అన్నారు. వారికి విభజనే కావాలనుకుంటే 403 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చుకోమనండి అన్నారాయన.

కోయంబత్తూరుతో సహా కొంగునాడును పశ్చిమ తమిళనాడు నుంచి వేరు చేయాలని బీజేపీ లోగడ కోరింది. అటానమీ కోసమో లేదా ప్రత్యేక దేశం కోసమో డిమాండ్ చేస్తున్న డీఎంకేని ఎదుర్కొనేందుకు బీజేపీ.. ఇప్పుడు మళ్ళీ విభజన అంశాన్ని తెరపైకి తీస్తోందా అని విశ్లేషిస్తున్నవారు లేకపోలేదు.

పశ్చిమ జిల్లాలనుంచి కొంగునాడును వేరు చేసి ప్రత్యేక రాష్ట్రం చేయాలని గత ఏడాది కోయంబత్తూరు జిల్లా బీజేపీ శాఖ ఓ తీర్మానాన్నిఆమోదించింది. కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, సేలం, నమక్కల్, నీలగిరి, ధర్మపురి, దిండిగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు కొంగునాడులో ఉన్నాయి.

తమిళనాడుకు ఇది పారిశ్రామికంగా మంచి ఆదాయాన్ని తెఛ్చి పెట్టే ప్రాంతం.. తాజాగా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని నాగేంద్రన్ కోరడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చునని భావిస్తున్నారు.

First Published:  7 July 2022 1:01 AM GMT
Next Story