Telugu Global
International

పదవిని పట్టుకుని పాకులాడినా దిగిపోక తప్పలేదు

చేసుకున్నోడికి చేసుకున్నంత..! చేసిన పాపాలకు నిష్కృతి తప్పదు. ఒకటా? రెండా? స్కాముల మీద స్కాములు ! వీటిలో ఛండాలంగా లైంగిక ‘స్కాములు’ కూడా చోటు చేసుకున్నా.. కిమ్మనని హై ప్రోఫైల్డ్ వ్యక్తి ఆయన.. తన మంత్రులు, ఎంపీలు ఛీ పొమ్మన్నా పట్టించుకోక చివరివరకు ‘కుర్చీని’ పట్టుకుని పాకులాడారు. కానీ, పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పేసరికి బేర్ మన్నాడు. ఆయనే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ! పదవికి రాజీనామా చేశాక కూడా ఇది వరల్డ్ లోనే […]

Boris Johnson
X

చేసుకున్నోడికి చేసుకున్నంత..! చేసిన పాపాలకు నిష్కృతి తప్పదు. ఒకటా? రెండా? స్కాముల మీద స్కాములు ! వీటిలో ఛండాలంగా లైంగిక ‘స్కాములు’ కూడా చోటు చేసుకున్నా.. కిమ్మనని హై ప్రోఫైల్డ్ వ్యక్తి ఆయన.. తన మంత్రులు, ఎంపీలు ఛీ పొమ్మన్నా పట్టించుకోక చివరివరకు ‘కుర్చీని’ పట్టుకుని పాకులాడారు. కానీ, పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పేసరికి బేర్ మన్నాడు. ఆయనే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ! పదవికి రాజీనామా చేశాక కూడా ఇది వరల్డ్ లోనే బెస్ట్ జాబ్ అని, దీన్ని వదిలేస్తున్నదుకు చాలా విచారంగా ఉందని అన్నాడు.

నేనెంత విచారంగా ఉన్నానో మీకు తెలుసు అని నెం. 10 డౌనింగ్ స్ట్రీట్ లో దాదాపు కంట తడిపెట్టినంత పని చేశాడు. 2019 జనవరిలో జరిగిన జనరల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా వారి ప్రయోజనాలకోసం చివరివరకు తాను ‘పోరాడానని’ దీనంగా చెప్పుకున్నాడు.

వరస బెట్టి మంత్రులు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసేసరికి తన ప్రభుత్వం కుప్ప కూలిన పరిస్థితుల్లో ఇక తానుండి కూడా చేసేదేమీ లేదంటూ బావురుమన్నాడు. పదవికి ముప్పు ముంచుకొచ్చిన పరిస్థితుల్లోనూ ..నిష్క్రమించిన మంత్రులు, ఎంపీల స్థానే కొత్తవారిని నియమించడానికి పూనుకొన్నాడాయన. ఈ కొత్తవారిలో తన మద్దతుదారులున్నారు.

కానీ మాజీ మాజీయే ! పార్టీకీ కొత్త నాయకుడు ఉండాలని, అలాగే కొత్త ప్రధాని కూడా ఈ కుర్చీలో కూచోవాలన్నది పార్లమెంటరీ కన్సర్వేటివ్ పార్టీ అభీష్టం .. తప్పదు మరి అని జాన్సన్ వ్యాఖ్యానించాడు.

ఇక కొత్త నేతను ఎన్నుకునే కార్యక్రమం ప్రారంభం కావాలని, వచ్చేవారం టైం టేబుల్ ని ప్రకటిస్తానని తెలిపాడు. మన బ్లాక్ బెంచీ ఎంపీలకు చైర్మన్ గా వ్యవహరించిన సర్ గ్రాహం బాడీతో నేను ఏకీభవిస్తున్నా.. కొత్త లీడర్ ఎంపిక ప్రాసెస్ ప్రారంభం కావలసిందే.. వచ్చేవారం దీనికి సంబంధించిన టైం టేబుల్ ని వెల్లడిస్తాం అని చెప్పారు.

నూతన నాయకుడి ఎంపిక జరిగేంతవరకు ప్రజాసేవకోసం ఇవాళ కేబినెట్ ని నియమించానని, అనేకమంది రాజీనామాలు చేశాక తనకిది తప్పలేదని, కానీ నన్ను దిగిపోవాలని అంతా కట్టకట్టుకుని డిమాండ్ చేశారని బోరిస్ జాన్సన్ బోరుమన్నారు.

తన సహచరులకు నచ్చజెప్పడానికి ఎంతో ట్రై చేశానని, అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఏమైనా చెప్పండి ! నా ప్రభుత్వం సాధించిన విజయాలకు నేనే గర్వపడుతున్నా.. బ్రెగ్జిట్ నుంచి కోవిడ్-19 పాండమిక్ వరకు ఈ దేశ స్టీరింగ్ చక్రాన్ని తిప్పుతూ వచ్చా ! అలాగే ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న వార్ విషయంలో పశ్చిమ దేశాలకు మన దేశమే లీడ్ లో ఉండేలా కృషి చేశా.. అని ఆయన చెప్పుకున్నారు.

దేశ ఆర్ధిక మంత్రిగా ఏక్ దిన్ కా సుల్తాన్ మాదిరి ఒకరోజు పదవి చేబట్టిన నదీమ్ జహావీ కూడా పాపం జాన్సన్ ని పట్టి కుదేసినంత పని చేశారు. మీరు రాజీనామా చేయాల్సిందేనని, ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన సంక్షోభం మరింత అధ్వాన్నం కాకముందే పదవి నుంచి దిగిపోవలసిందేనని, ఇది మీకు, కన్సర్వేటివ్ పార్టీకి, దేశానికి కూడా మంచిదేనని ఆయన మొట్టికాయలు వేశారు. ‘యూ మస్ట్ డూ ది రైట్ థింగ్ అండ్ గో నౌ ‘ (మీరు మంచిగా నిష్క్రమించడమే మంచిది) అని ఆయన చేసిన ట్వీట్ జాన్సన్ కి ఓ పీడకలగా మిగిలిపోతుంది.

First Published:  7 July 2022 9:19 AM GMT
Next Story