Telugu Global
MOVIE UPDATES

బాలకృష్ణ మూవీ షూటింగ్ అప్ డేట్స్

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు బాలయ్య. దీంతో ఆయనతో సినిమా చేస్తున్న యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త షెడ్యూల్ ను టర్కీలో ప్లాన్ చేశారు. నిజానికి ఈ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. కానీ వీసా సమస్యల వల్ల లొకేషన్ ను టర్కీకి మార్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ఎప్పట్లానే డ్యూయల్ […]

Balakrishna
X

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు బాలయ్య. దీంతో ఆయనతో సినిమా చేస్తున్న యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త షెడ్యూల్ ను టర్కీలో ప్లాన్ చేశారు. నిజానికి ఈ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. కానీ వీసా సమస్యల వల్ల లొకేషన్ ను టర్కీకి మార్చారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ఎప్పట్లానే డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. కథ ప్రకారం, సినిమాలో ఓ భాగాన్ని అమెరికాలో షూట్ చేయాలి. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో, దాన్ని టర్కీకి షిఫ్ట్ చేశారు. కానీ కథ ప్రకారం అమెరికా అనే చెబుతారు. రీసెంట్ గా రంగ్ దే అనే సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. పరిస్థితులు అనుకూలించక దుబాయ్ లో షూట్ చేసి, కథలో మాత్రం అమెరికా అని చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్, రవిశంకర్ నిర్మాతలు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్, ఈ సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయమౌతున్నాడు.

త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు మేకర్స్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి షెడ్యూల్ డేట్స్ మాత్రం లాక్ చేయలేదు. ఎందుకంటే, బాలయ్య కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. యూనిట్ లో మరికొందరికి తాజాగా కరోనా సోకింది.

First Published:  7 July 2022 3:36 AM GMT
Next Story