‘కాళి’ పోస్టర్ తర్వాత కన్యాకుమారిలో శివుడు ‘సిగరెట్ వెలిగిస్తున్న’ బ్యానర్ కలకలం
ఓ వైపు లీనా మణిమేకలై విడుదల చేసిన “కాళి” పోస్టర్ సంచనలమై వివాదం కొనసాగుతుండగానే మరో వైపు హిందూ ఆరాధ్య దైవమైన శివుడి ఫొటో అదే తరహాలో వెలిసింది. ఈసారి ఈ పోస్టర్ తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రత్యక్షమై కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ శివుడు సిగరెట్ వెలిగిస్తున్నట్లు బ్యానర్ లో కనబడుతోంది. బ్యానర్ వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు బ్యానర్ వేసిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరించారు. వివాదం ముదిరిపోతుండడంతో పోలీసులు బ్యానర్‌ను తొలగించారు. ఈ […]
ఓ వైపు లీనా మణిమేకలై విడుదల చేసిన “కాళి” పోస్టర్ సంచనలమై వివాదం కొనసాగుతుండగానే మరో వైపు హిందూ ఆరాధ్య దైవమైన శివుడి ఫొటో అదే తరహాలో వెలిసింది. ఈసారి ఈ పోస్టర్ తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రత్యక్షమై కలకలం సృష్టిస్తోంది.
ఇక్కడ శివుడు సిగరెట్ వెలిగిస్తున్నట్లు బ్యానర్ లో కనబడుతోంది. బ్యానర్ వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు బ్యానర్ వేసిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరించారు. వివాదం ముదిరిపోతుండడంతో పోలీసులు బ్యానర్‌ను తొలగించారు. ఈ బ్యానర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బ్యానర్లు ఎవరు పెట్టారు?
రెండు రోజుల క్రితం కన్యాకుమారి జిల్లా తింగల్ నగర్ సమీపంలోని ఆరోగ్యపురంలో ఓ జంట పెళ్లి చేసుకుంది. వరుడు ప్రతీష్‌ని అభినందించేందుకు అతని స్నేహితులు రెండు చోట్ల వివాదాస్పద బ్యానర్‌లు కట్టారు. ఒక బ్యానర్‌లో దంపతులకు వారి స్నేహితులు అభినందనలు తెలుపుతున్న ఫొటో ఉండగా, మరొక బ్యానర్ శివుడు సిగరెట్ వెలిగిస్తున్నట్లు చూపుతోంది. ఈ బ్యానర్‌లో, ‘జుట్టు చిన్నదిగా ఉంచుకో..నీ భార్య నీ జుట్టు పట్టుకునేందుకు వీలుండదు’ అంటూ అతని స్నేహితులు సరదాగా ఓ క్యాప్షన్ కూడా పెట్టారు.