Telugu Global
National

`కాళీ` చిత్రంతో సంచ‌ల‌నం.. ఎవ‌రీ లీనా మ‌ణిమేక‌లై?

కాళికా దేవిని సిగ‌రెట్ తాగే మ‌హిళ‌గా చిత్రీక‌రించిన ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లీనా మ‌ణి మేక‌లై పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లురాష్ట్రాల్లో ఆమెపై కేసులు న‌మోద‌య్యాయి. ఈ సంద‌ర్భంలో లీనా ఎవ‌రు, ఆమె నేప‌థ్యం ఏమిటి అనే విష‌యంపై జ‌నాలు ఆరా తీస్తున్నారు. ఇదీ నేప‌థ్యం.. లీనా త‌మిళ‌నాడులోని మ‌ధురైలో జ‌న్మించింది. శ్రీ విల్లిపుత్తూరు ప్రాంతానికి చెందిన లీనా.. ప్ర‌స్తుతం కెన‌డాలో నివాసం ఉంటుంది. ఆమె 1995లో హోలీ క్రాస్ […]

`కాళీ` చిత్రంతో సంచ‌ల‌నం.. ఎవ‌రీ లీనా మ‌ణిమేక‌లై?
X

కాళికా దేవిని సిగ‌రెట్ తాగే మ‌హిళ‌గా చిత్రీక‌రించిన ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లీనా మ‌ణి మేక‌లై పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లురాష్ట్రాల్లో ఆమెపై కేసులు న‌మోద‌య్యాయి. ఈ సంద‌ర్భంలో లీనా ఎవ‌రు, ఆమె నేప‌థ్యం ఏమిటి అనే విష‌యంపై జ‌నాలు ఆరా తీస్తున్నారు.

ఇదీ నేప‌థ్యం..
లీనా త‌మిళ‌నాడులోని మ‌ధురైలో జ‌న్మించింది. శ్రీ విల్లిపుత్తూరు ప్రాంతానికి చెందిన లీనా.. ప్ర‌స్తుతం కెన‌డాలో నివాసం ఉంటుంది. ఆమె 1995లో హోలీ క్రాస్ కాన్వెంట్ లో మాధ్యమిక పాఠశాల విద్య‌ను పూర్తి చేసింది. మధురై కామరాజర్ విశ్వవిద్యాలయంలో ఉన్న‌త‌ విద్యను అభ్యసించింది. 2005 సంవత్సరంలో, ఆమె మీడియా, కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్‌లో ఈయూ (EU) ఫెలోషిప్‌ని పూర్తిచేసింది. ఆమె 2008లో తమిళ మహిళా కవిత్వంపై పీఎస్ బీటీ ఫిల్మ్ ఫెలోషిప్, 2008లో మహిళలపై కామన్‌వెల్త్ ఫెలోషిప్ పూర్తిచేసింది. ఆమె 2012లో ది స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ నుంచి విజువల్ ఎథ్నోగ్రఫీలో పట్టభద్రురాలైంది.

లీనా మణిమేకలై టొరంటోలో ఉంటూ భారతీయ చిత్రనిర్మాత, కవయిత్రి, నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఐదు క‌వితా సంక‌ల‌నాల‌ను ప్ర‌చురించారు. డాక్యుమెంటరీ, ఫిక్షన్, ప్రయోగాత్మక పద్య చిత్రాలతో సహా కళా ప్రక్రియలో డజన్‌ చిత్రాలు ఉన్నాయి. ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొని ఉత్తమ చలనచిత్ర అవార్డులను అందుకుని మంచి గుర్తింపు పొందారు.

ముందునుంచీ మొండిత‌నం, వివాదాస్ప‌దమే..!
స‌హాయ ద‌ర్శ‌కురాలిగా కెరీర్ ప్రారంభించిన లీనా మొద‌టినుంచి వివాదాస్ప‌దురాలిగానే ఉండేది. మొండి ప‌ట్టుద‌ల‌తో ఉండేది. త‌ల్లిదండ్రులు వారించినా తాను అనుకున్న‌ది సాధించే వ‌ర‌కూ వ‌దిలేది కాదు.

లీనా మణిమేకలై ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ కూడా స్థాపించారు. లీనా అనేక డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించారు. ఆమె రచనలలో మాతమ్మ (దేవదాసీ వ్యవస్థపై), డాక్యుమెంట‌రీ నిర్మాణ‌ స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు, అరుంధ‌తీ యార్ సంఘాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చినా ఆమె వెన‌క అడుగు వేయ‌లేదు. పరాయి (దళిత మహిళలపై హింసకు వ్యతిరేకంగా), సంకెళ్ళు బద్దలు కొట్టడం(బ్రేకింగ్ ది ష‌కిల్స్‌), లవ్ లాస్ట్, ఏ హోల్ ఇన్ ది బకెట్, దేవతలు(గాడెస్సెస్), మై మిర్రర్ ఈజ్ ది డోర్, సాంగ్ ఆఫ్ రెసిస్టెన్స్ వంటివి ప్రాచుర్యం పొందాయి.

2011లో నిర్మించిన ‘సెంగడల్’ సినిమా వివాదాస్ప‌ద‌మైంది. ఇండియా, శ్రీలంకల మధ్య చిక్కుకుపోయిన ఓ మత్స్యకారుడి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘సెంగడల్’ ను ప్రాంతీయ సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. ఫిలిం అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ అనుమతించడంతో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. దాదాపు ఆమె నిర్మించినవ‌న్నీ సామాజిక స్పృహతో కూడుకున్న‌వే.

లీనా మణిమేకలై తాజాగా ‘కాళీ’ డాక్యుమెంటరీతో మ‌ళ్ళీ వివాదంలోకి అడుగుపెట్టింది. టొరెంటోలోని అగా ఖాన్ మ్యూజియం ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’ విభాగంలో ఈ చిత్రం భాగమని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. ‘కాళీ’ పోస్టర్‌ను విడుదల చేయగానే.. ఎంత సంచ‌ల‌నం రేగిందో తెలిసిందే. ఈ వివాదాలు, విమ‌ర్శ‌లు, త‌న‌పై కేసులు న‌మోద‌వ్వ‌డంపై లీనా స్పందించింది. ‘‘నాకు పోయేదేమి లేదు. నేను నమ్మిన‌ విషయాన్ని బతికి ఉన్నంత వరకూ ధైర్యంగా చెబుతాను. ఒక వేళ నా ప్రాణాల్ని ప‌ణంగా పెట్టాల్సి వ‌చ్చినా అందుకు నేను సిద్ధం’’ అని తెలిపింది.

ఎన్నో అవార్డులు, రివార్డులు..
యూరప్ ఫిల్మ్ ఫెస్టివల్ (2004), ప్యారిస్, నార్వేలో ఇండిపెండెంట్ డయాస్పోరా ఫెస్టివల్స్ (2005), ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (2008)లో ఉత్తమ డాక్యుమెంటరీకి సిల్వర్ ట్రోఫీతో సహా గోల్డెన్ శంఖం, అనేక ప్రశంసలు, అవార్డులను అందుకున్నారు.

First Published:  6 July 2022 7:00 AM GMT
Next Story