Telugu Global
NEWS

వెంకయ్య పోటీలో లేడుగా.. టీడీపీ మద్దతు ఎవరికి..?

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరి స్పష్టంగా ప్రకటించలేదు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తారా, లేక ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తారా అనేది బయటపెట్టలేదు. అయితే ఈ ముసుగులో గుద్దులాట దేనికంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ విధానం అని.. అందుకే […]

Venkaiah Naidu
X

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరి స్పష్టంగా ప్రకటించలేదు.

ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తారా, లేక ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తారా అనేది బయటపెట్టలేదు. అయితే ఈ ముసుగులో గుద్దులాట దేనికంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ విధానం అని.. అందుకే ఎస్టీ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తమ పార్టీ మద్దతు ఇచ్చిందని సజ్జల వివరించారు. గతంలో టీడీపీ హయాంలో స్పీకర్ గా కోడెల శివప్రసాద్‌ కు కూడా తాము మద్దతు ఇచ్చినట్లు గుర్తుచేశారు సజ్జల.

రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై తాము క్లారిటీతో ఉన్నామని, టీడీపీ ఇప్పటి వరకు వారి వైఖరి ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారాయన. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఉంటేనే మద్దతు ఇస్తారా అని నిలదీశారు. లేకపోతే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు చంద్రబాబు సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.

ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని తమకు లేదని, ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన అస్సలు లేదని స్పష్టం చేశారు సజ్జల. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలపైనే ఉంటుందని చెప్పారు. కానీ టీడీపీ మాత్రం కేంద్రంలో చక్రం తిప్పాలని చూసి, రాష్ట్రంలో చతికిలపడిందని ఎద్దేవా చేశారు. తీరా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎటూ తేల్చుకోలేక గోడమీద పిల్లి వాటంలా మిగిలిపోయిందని చెప్పారు.

బీజేపీతో పొత్తుకు సై అంటున్న చంద్రబాబు.. ఆ పార్టీ అడక్కుండానే మద్దతిస్తే తమ పరువుపోతుందని వేచి చూస్తున్నారని చెప్పారు. పోనీ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తే.. మోదీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

First Published:  6 July 2022 9:47 AM GMT
Next Story