Telugu Global
CRIME

ఉదయ్ పూర్ టైలర్ ను హత్యచేసిన నిందితుడు హైదరాబాద్ లో అరెస్ట్

బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శర్మ, మహ్మద్ ప్ర‌వక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఆమె వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు రాజస్థాన్, ఉదయ పూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను కొందరు దుండగులు హత్యచేసిన నేపథ్యంలో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అందులో కొందరు నిందితులు పరారీ లో ఉన్నారు. వారి కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు జరుపుతున్నారు. అందులో […]

ఉదయ్ పూర్ టైలర్ ను హత్యచేసిన నిందితుడు హైదరాబాద్ లో అరెస్ట్
X

బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శర్మ, మహ్మద్ ప్ర‌వక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఆమె వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు రాజస్థాన్, ఉదయ పూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను కొందరు దుండగులు హత్యచేసిన నేపథ్యంలో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.

అందులో కొందరు నిందితులు పరారీ లో ఉన్నారు. వారి కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు జరుపుతున్నారు. అందులో బీహార్ కు చెందిన నిందితుడిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

నిందితుడు హైదరాబాద్ పాత బస్తీలోని ఖలందర్ నగర్ లో లక్కీ హోటల్ కు సమీపంలో ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాడని సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు మంగ‌ళ‌వారం పాత‌బ‌స్తీలో అత‌డిని అరెస్ట్ చేశారు. అనంత‌రం అత‌డిని రాజ‌స్థాన్ కు త‌ర‌లించారు.

First Published:  5 July 2022 8:54 PM GMT
Next Story