Telugu Global
MOVIE UPDATES

తమన్నకు అతిపెద్ద భయం ఏంటో తెలుసా?

ప్రతి ఒక్కరికి ఒక్కో ఫోబియా ఉంటుంది. కొందరిక చీకటి అంటే భయం. మరికొందరికి పాములంటే భయం. ఇలాంటి ఓ ఫోబియా తమన్నాకు కూడా ఉంది. మిల్కీబ్యూటీకి ఉన్న అతి పెద్ద భయం ఏంటంటే.. జ్ఞాపకశక్తిని కోల్పోతానేమో అనేది ఈమెకున్న అతిపెద్ద భయం అంట. ఈ విషయాన్ని స్వయంగా తమన్న బయటపెట్టింది. “ఉన్నట్టుంది సడెన్ గా జ్ఞాపకశక్తిని కోల్పోతానేమో అనేది నా భయం. అప్పటివరకు గుర్తున్న అంశాల్ని తిరిగి గుర్తుపట్టలేనేమో. బాగా తెలిసిన వ్యక్తులు ఎదురైతే పలకరించనేమో. ఇలాంటి […]

తమన్నకు అతిపెద్ద భయం ఏంటో తెలుసా?
X

ప్రతి ఒక్కరికి ఒక్కో ఫోబియా ఉంటుంది. కొందరిక చీకటి అంటే భయం. మరికొందరికి పాములంటే భయం. ఇలాంటి ఓ ఫోబియా తమన్నాకు కూడా ఉంది. మిల్కీబ్యూటీకి ఉన్న అతి పెద్ద భయం ఏంటంటే.. జ్ఞాపకశక్తిని కోల్పోతానేమో అనేది ఈమెకున్న అతిపెద్ద భయం అంట. ఈ విషయాన్ని స్వయంగా తమన్న బయటపెట్టింది.

“ఉన్నట్టుంది సడెన్ గా జ్ఞాపకశక్తిని కోల్పోతానేమో అనేది నా భయం. అప్పటివరకు గుర్తున్న అంశాల్ని తిరిగి గుర్తుపట్టలేనేమో. బాగా తెలిసిన వ్యక్తులు ఎదురైతే పలకరించనేమో. ఇలాంటి భయాలు నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. మెమొరీ కోల్పోతున్నాననే ఆలోచన నన్ను ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తుంది.”

ఇలా తన భయాన్ని బయటపెట్టింది మిల్కీబ్యూటీ. ఉన్నట్టుండి సడెన్ గా ట్విట్టర్ లోకి వచ్చిన ఈ బ్యూటీ, ఏదైనా అడగండి సమాధానం చెబుతానంటూ ఊరించింది. వచ్చిన చాలా ప్రశ్నల నుంచి తనకిష్టమైన కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పింది. అందులో భాగంగానే ఇలా తన జీవితంలో తను ఎదుర్కొంటున్న అతిపెద్ద భయాన్ని బయటపెట్టింది తమన్న.

ప్రస్తుతం ఈ బ్యూటీ అన్ని భాషల్లో, అన్ని ఫార్మాట్స్ లో నటిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో తమన్నానే హీరోయిన్.

First Published:  5 July 2022 10:17 PM GMT
Next Story