Telugu Global
MOVIE UPDATES

సమంత బాలీవుడ్ మూవీ లాక్ అయిందా?

సౌత్ పాపులర్ హీరోయిన్లలో సమంత ఒకరు. మనోజ్ బాజ్ బాయ్ తో కలిసి ఆమె చేసిన ఫ్యామిలీ మేన్ సీజన్-2 దేశవ్యాప్తంగా పెద్ద హిట్టవ్వడంతో, బాలీవుడ్ లో కూడా ఆమెకు క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ, తాప్సి ప్రొడక్షన్ లో సమంత ఓ హిందీ సినిమా చేయబోతోందంటూ వార్తలొచ్చాయి. అయితే సమంత ఇప్పటికే ఆయుష్మాన్ ఖురానా సరసన నటించేందుకు ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ మీడియా ప్రకారం, సౌత్ […]

సమంత బాలీవుడ్ మూవీ లాక్ అయిందా?
X

సౌత్ పాపులర్ హీరోయిన్లలో సమంత ఒకరు. మనోజ్ బాజ్ బాయ్ తో కలిసి ఆమె చేసిన ఫ్యామిలీ మేన్ సీజన్-2 దేశవ్యాప్తంగా పెద్ద హిట్టవ్వడంతో, బాలీవుడ్ లో కూడా ఆమెకు క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ, తాప్సి ప్రొడక్షన్ లో సమంత ఓ హిందీ సినిమా చేయబోతోందంటూ వార్తలొచ్చాయి. అయితే సమంత ఇప్పటికే ఆయుష్మాన్ ఖురానా సరసన నటించేందుకు ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్‌ మీడియా ప్రకారం, సౌత్ కు చెందిన మద్దాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజయ్ నిర్మాణంలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందట. ఈ ప్రాజెక్టుతోనే సమంత, బాలీవుడ్ లో అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఆమెకు ఇది పెర్ ఫెక్ట్ లాంఛ్ ప్యాడ్ అవుతుందని బాలీవుడ్ వార్తలిస్తోంది.

2023 చివరలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, సమంత రోల్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి.

పౌరాణిక చిత్రం శాకుంతలంలో నటించింది సమంత. ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ యశోద సినిమా చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషీ అనే రొమాంటిక్ మూవీ చేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో డిఫరెంట్ మూవీ చేయబోతోంది. ఇలా కెరీర్ లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతోంది సమంత.

First Published:  5 July 2022 10:21 PM GMT
Next Story