Telugu Global
MOVIE UPDATES

నంబర్ వన్ పొజిషన్ పై హీరోయిన్ వేదాంతం

పదేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతోంది. చాలా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ లీగ్ లోకి మాత్రం వెళ్లలేకపోయింది లావణ్య త్రిపాఠి. కనీసం ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. మరి దీనిపై లావణ్య త్రిపాఠి ఎలా ఫీల్ అవుతోంది? తన దశాబ్ద కాల సినీ ప్రస్థానంపై లావణ్య రెస్పాన్స్ ఏంటి? “పదేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అదే గొప్ప విషయం, అదే నాకు గొప్ప ఆనందం. అందరూ నెంబర్ వన్ కి వెళ్ళాలని ఉండరు కదా. […]

నంబర్ వన్ పొజిషన్ పై హీరోయిన్ వేదాంతం
X

పదేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతోంది. చాలా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ లీగ్ లోకి మాత్రం వెళ్లలేకపోయింది లావణ్య త్రిపాఠి. కనీసం ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. మరి దీనిపై లావణ్య త్రిపాఠి ఎలా ఫీల్ అవుతోంది? తన దశాబ్ద కాల సినీ ప్రస్థానంపై లావణ్య రెస్పాన్స్ ఏంటి?

“పదేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అదే గొప్ప విషయం, అదే నాకు గొప్ప ఆనందం. అందరూ నెంబర్ వన్ కి వెళ్ళాలని ఉండరు కదా. నంబర్ గేమ్ తో సంబంధం లేకుండా నా వర్క్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి తీసుకోను. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. నా ప్రయాణం సంతృప్తికరంగా ఉంది. ఇంతకంటే నాకేం కావాలి.”

ఇలా తన పదేళ్ల సినీ ప్రస్థానంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది లావణ్య త్రిపాఠి. ఈ పదేళ్లలో ఎన్నో మంచి పాత్రలు చేశానని, తనకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు ఉందని, అది తనకు చాలని అంటోంది. మరో పదేళ్ల తర్వాత లావణ్య త్రిపాఠి పేరు చెబితే, ప్రేక్షకులు వెంటనే గుర్తుపడితే, అంతకంటే తనకు కావాల్సిందేం ఉంటుందని చెబుతోంది.

ఇండస్ట్రీకొచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు మీడియాకు పెద్ద పార్టీ ఇస్తోంది లావణ్య. తన సినీ ప్రయాణంలో తనకు సహకరించినందుకు కృతజ్ఞతగా అన్ని సెక్షన్ల మీడియాకు ఆమె ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీ ఇస్తోంది.

First Published:  6 July 2022 3:01 AM GMT
Next Story