Telugu Global
MOVIE UPDATES

కృతి శెట్టి బ్యాగులో లింగుసామి సినిమా సీడీ

లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేసింది కృతి శెట్టి. ఈనెలలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ మూవీ ప్రచారం టైమ్ లో లింగుసామిపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. లింగుసామి అంటే తనకు చాలా ఇష్టమని, అతడు డైరక్ట్ చేసిన ఆవారా సినిమా సీడీ తన బ్యాగులో నిత్యం ఉండేదని చెప్పుకొచ్చింది. “నేను చదువుకునే రోజుల్లో హాలిడేస్ ఇస్తే, నా బ్యాగులో ఆవారా సినిమా సీడీ ఉండాల్సిందే. ఆ సీడీ పట్టుకొని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. […]

Krithi Shetty
X

లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేసింది కృతి శెట్టి. ఈనెలలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ మూవీ ప్రచారం టైమ్ లో లింగుసామిపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. లింగుసామి అంటే తనకు చాలా ఇష్టమని, అతడు డైరక్ట్ చేసిన ఆవారా సినిమా సీడీ తన బ్యాగులో నిత్యం ఉండేదని చెప్పుకొచ్చింది.

“నేను చదువుకునే రోజుల్లో హాలిడేస్ ఇస్తే, నా బ్యాగులో ఆవారా సినిమా సీడీ ఉండాల్సిందే. ఆ సీడీ పట్టుకొని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. అలా ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో నాకే గుర్తులేదు. లింగుసామి డైరక్షన్ అంటే నాకు అంతిష్టం. సినిమాల్లోకి వచ్చాక ఎప్పుడు ఆయన దర్శకత్వంలో నటిస్తానా అని ఎదురుచూసేదాన్ని. ఓరోజు అమ్మ ఫోన్ చేసింది. నా కోసం లింగుసామి సంప్రదించారని చెప్పింది. దీంతో నా ఆనందానికి అవధుల్లేవ్.”

ఆ వెంటనే లింగుసామిని కలిశానని, ఆయన కథ చెబుతుంటే తనకు చాలా థ్రిల్ అనిపించిందని.. ఆ వెంటనే ఓకే చెప్పేశానని తెలిపింది కృతిశెట్టి. తన ఫేవరెట్ దర్శకుడి సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అంటోంది. ప్రస్తుతం తమిళ్ నేర్చుకుంటున్నానని, త్వరలోనే తమిళ్ లో డబ్బింగ్ చెబుతానని అంటోంది ఈ బ్యూటీ.

First Published:  6 July 2022 4:01 AM GMT
Next Story