Telugu Global
International

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ కొత్త ప్రధాని కానున్నారా?

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అతడిపై పలు స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. గత నెలలో అవిశ్వాస తీర్మానాన్ని 12 ఓట్ల తేడాతో గెలిచి ప్రస్తుతానికి తన పదవిని కాపాడుకున్నారు. దీంతో ఆయన మరో ఏడాది పాటు ఆ పదవిలో ఉండేలా అవకాశం లభించింది. కానీ తన సొంత పార్టీ (కన్జర్వేటీవ్ పార్టీ) మాత్రం నిబంధనలు మార్చడానికి నిర్ణయం తీసుకున్నది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన […]

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ కొత్త ప్రధాని కానున్నారా?
X

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అతడిపై పలు స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. గత నెలలో అవిశ్వాస తీర్మానాన్ని 12 ఓట్ల తేడాతో గెలిచి ప్రస్తుతానికి తన పదవిని కాపాడుకున్నారు. దీంతో ఆయన మరో ఏడాది పాటు ఆ పదవిలో ఉండేలా అవకాశం లభించింది. కానీ తన సొంత పార్టీ (కన్జర్వేటీవ్ పార్టీ) మాత్రం నిబంధనలు మార్చడానికి నిర్ణయం తీసుకున్నది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన వారు ఇకపై 12 నెలల పాటు కాకుండా అంతకంటే తక్కువ సమయంలోనే మరోసారి గెలవాలనే విధంగా రూల్స్ మార్చనున్నది.

మరోవైపు మంగళవారం బోరిస్ మంత్రివర్గం నుంచి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు వైదొలిగారు. ఇది బోరిస్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ రూల్స్ మారిస్తే.. బోరిస్ ప్రధాని సీటును వదులుకోక తప్పదని స్పష్టం చేస్తున్నారు. మరి కొంత మంది మంత్రులు కూడా వైదొలగబోతున్నారని, త్వరలోనే బోరిస్ ప్లేస్‌లో మరో వ్యక్తి ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రేసులో పలువురు మాజీ మంత్రులు రేసులో ఉన్నారు. అందులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ముందు వరుసలో ఉన్నారు.

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి అల్లుడే రిషి సునక్. ఆయన నిన్నటి వరకు బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. భారత మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించిన రిషి, 2015 నుంచి రిచ్‌మండ్ ఎంపీగా ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. బ్రెగ్జిట్ విత్‌డ్రా అగ్రిమెంట్‌కు అనుకూలంగా ఆయన ఓటు వేశారు. థెరిసా మే రాజీనామా చేసిన తర్వాత బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ లీడర్‌గా ఎన్నికవడంలో రిషి కీలక పాత్ర పోషించారు.

కరోనా పాండమిక్ సమయంలో రెస్క్యూ ప్యాకేజీని ప్రకటించి దేశ ప్రజలకు దగ్గరయ్యారు. అంతే కాకుండా జాబ్ రిటెన్షన్ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగం పెరగకుండా చూవారు. ఇందు కోసం 410 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 31 వేల కోట్లు) వ్యయం అయ్యింది. ఈ పథకం ద్వారా రిషికి బ్రిటన్‌లో మంచి పేరు వచ్చింది. అయితే, బ్రిటన్‌లో ధరలు, మధ్య తరగతి వాళ్ల ఖర్చులు అమాంతం పెరగడంతో రిషి విధానాలపై వ్యతిరేకత వచ్చింది. తన భార్య అక్షత మూర్తి నాన్ డొమిసైల్డ్ స్టేటస్ ఆయనకు వివాదాన్ని తెచ్చిపెట్టింది. రిషి బ్రిటన్ పౌరుడే అయినా.. అక్షత మాత్రం భారత పౌరసత్వం కలిగి ఉన్నారు. బ్రిటన్‌లో నాన్-డొమిసైల్ స్టేటస్‌లో ఉన్నారు. ఆమె దాదాపు 20 మిలియన్ పౌండ్ల ట్యాక్సులు ఎగ్గొట్టారనే ఆరోపణలు రిషికి ఆటంకంగా మారాయి.

ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేయడం మొదలు పెట్టిన తర్వాత అనేక యూరోప్ కంపెనీలు రష్యా నుంచి తమ వ్యాపారాలను విరమించుకున్నాయి. అయితే ఇన్ఫోసిస్ అక్కడ తన కార్యాలయాలు కొనసాగించడంపై బ్రిటన్‌లో వ్యతిరేకత మొదలైంది. ఇన్ఫోసిస్‌లో రిషి భార్య అక్షతకు ఇన్ఫోసిస్‌లో దాదాపు 1 శాతం వాటా ఉన్నది. దీనిపై పలు విమర్శలు రావడంతో రష్యా నుంచి తమ కార్యాలయాలు తరలిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.

కరోనా సమయంలో బోరిస్ జాన్సన్‌తో సహా రిషి కూడా లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించి బయట పర్యటించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బడ్జెట్‌లో భారీగా ట్యాక్సులు పెంచారు. 1950 తర్వాత భారీగా ట్యాక్సులు పెంచిన అపవాదు ఆర్థిక మంత్రిగా రిషిపై పడింది. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం పదవికి రాజీనామా చేసి జాన్సన్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రిషి సునక్‌తో పాటు బ్రిటన్ ఫారిన్ సెక్రటరీ లిజ్ ట్రాస్, మాజీ ఫారిన్ సెక్రటరీ జెర్మీ హంట్, పార్లమెంట్ సభ్యుడు బెన్ వాలెస్, ఎడ్యుకేషన్ సెక్రటరీ నదిమ్ జహావి, మాజీ డిఫెన్స్ సెక్రటరీ పెన్నీ మార్డంట్ కూడా ప్రధాని రేసులో ఉన్నారు.

First Published:  6 July 2022 12:12 AM GMT
Next Story