Telugu Global
MOVIE UPDATES

రిలీజ్ అనుమానాలు.. ఇక ప్రచారానికి దారేది?

ఓ సినిమాకు ప్రచారం ప్రారంభించాలంటే ముందుగా చేయాల్సిన పనేంటి? అన్నింటికంటే ముందుగా సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలి. విడుదల తేదీ లాక్ చేయకుండా ప్రచారం చేయడమంటే, టార్గెట్ లేని ప్రయాణం చేయడమే. తోకలేని గాలిపటమే. అందుకే విడుదల తేదీపై ముందుగా స్పష్టత తెచ్చుకున్న తర్వాత ప్రచారాన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటారు ఎవరైనా. కానీ కార్తికేయ-2 విషయంలో ఇది రివర్స్ అవుతోంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రచారం ఆల్రెడీ మొదలైంది. క్యారెక్టర్ పోస్టర్లు వరుసగా […]

KARTHIKEYA2
X

ఓ సినిమాకు ప్రచారం ప్రారంభించాలంటే ముందుగా చేయాల్సిన పనేంటి? అన్నింటికంటే ముందుగా సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలి. విడుదల తేదీ లాక్ చేయకుండా ప్రచారం చేయడమంటే, టార్గెట్ లేని ప్రయాణం చేయడమే. తోకలేని గాలిపటమే. అందుకే విడుదల తేదీపై ముందుగా స్పష్టత తెచ్చుకున్న తర్వాత ప్రచారాన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటారు ఎవరైనా. కానీ కార్తికేయ-2 విషయంలో ఇది రివర్స్ అవుతోంది.

నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రచారం ఆల్రెడీ మొదలైంది. క్యారెక్టర్ పోస్టర్లు వరుసగా విడుదల చేశారు. ఆ తర్వాత ఏకంగా ట్రయిలర్-1 విడుదల చేశారు. మరిన్ని ట్రయిలర్స్ వస్తాయని ఊరించారు. విడుదల చేసిన ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా అంతా బాగుంది కానీ, ఈ సినిమా విడుదల తేదీపై మాత్రం స్పష్టత రావడం లేదు.

లెక్కప్రకారం, ఈనెల 22న కార్తికేయ-2 రిలీజ్ అవ్వాలి. కానీ కొంతమంది ఆ తేదీకి సినిమా రాదంటున్నారు. మరికొందరు మాత్రం వస్తుందంటున్నారు. మేకర్స్ కూడా ఈ విషయంపై ఏమీ చెప్పలేకపోతున్నారు. గట్టిగా అడిగితే ప్రస్తుతానికైతే 22వ తేదీకే రిలీజ్ అని రాస్కోండి అంటున్నారు.

ఇలా మేకర్స్ కే స్పష్టత లేకుండా సినిమా ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో నిఖిల్ కూడా కలుగజేసుకోవడం లేదు. ఆయన స్పై అనే సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కింది కార్తికేయ-2 సినిమా.

First Published:  6 July 2022 2:01 AM GMT
Next Story