Telugu Global
MOVIE UPDATES

కోలుకున్న బాలయ్య.. షూటింగ్ కు రెడీ

కరోనా 3 దశల నుంచి సక్సెస్ ఫుల్ గా తప్పించుకున్న బాలయ్య, ఈసారి మాత్రం దొరికిపోయారు. అనూహ్యంగా ఆయన కరోనా బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్, ప్రాణాంతకం కాకపోవడంతో ఎవరూ పెద్దగా టెన్షన్ పడలేదు. అయినప్పటికీ బాలయ్య మాత్రం స్వీయ జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లిన బాలయ్య.. వైద్యుల పర్యవేక్షణలో అన్ని మందులు తీసుకున్నారు. బ్రీతింగ్ కు సంబంధించిన వ్యాయామాలు చేశారు. పోషకాలున్న ఆహారం […]

Nandamuri Balakrishna
X

కరోనా 3 దశల నుంచి సక్సెస్ ఫుల్ గా తప్పించుకున్న బాలయ్య, ఈసారి మాత్రం దొరికిపోయారు. అనూహ్యంగా ఆయన కరోనా బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్, ప్రాణాంతకం కాకపోవడంతో ఎవరూ పెద్దగా టెన్షన్ పడలేదు. అయినప్పటికీ బాలయ్య మాత్రం స్వీయ జాగ్రత్తలు తీసుకున్నారు.

కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లిన బాలయ్య.. వైద్యుల పర్యవేక్షణలో అన్ని మందులు తీసుకున్నారు. బ్రీతింగ్ కు సంబంధించిన వ్యాయామాలు చేశారు. పోషకాలున్న ఆహారం తీసుకున్నారు. అలా వారం రోజులుగా ఇంటికే పరిమితమైన బాలయ్య, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా లేదని తేలింది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాలయ్య, ఈనెల 9 నుంచి తన కొత్త సినిమా సెట్స్ పైకి రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ శరవేగంగా సాగుతున్న టైమ్ లో బాలయ్య కరోనా బారిన పడ్డంతో, అన్ని పనులు ఆపేశారు.

మళ్లీ ఇప్పుడీ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సినిమాను పూర్తిచేసి, ప్రచారం ప్రారంభించాలని అనుకుంటోంది యూనిట్. సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  6 July 2022 5:01 AM GMT
Next Story