Telugu Global
MOVIE UPDATES

వీకెండ్ రిలీజ్ – ఈ వారం 6 సినిమాలు

ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల హంగామా నడుస్తోంది. వరుసపెట్టి సినిమాలన్నీ థియేటర్లలో క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో మరో అరడజను సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా ఒకే ఒక్కటి. అదే హ్యాపీ బర్త్ డే. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ, ఈ సినిమాకు అండగా ఉంది. దీనికి తోడు మూవీ ట్రయిలర్ కూడా పెద్ద హిట్టయింది. దీంతో హ్యాపీ బర్త్ డే సినిమాపై అంచనాలు […]

వీకెండ్ రిలీజ్ – ఈ వారం 6 సినిమాలు
X

ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల హంగామా నడుస్తోంది. వరుసపెట్టి సినిమాలన్నీ థియేటర్లలో క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో మరో అరడజను సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా ఒకే ఒక్కటి. అదే హ్యాపీ బర్త్ డే.

మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ, ఈ సినిమాకు అండగా ఉంది. దీనికి తోడు మూవీ ట్రయిలర్ కూడా పెద్ద హిట్టయింది. దీంతో హ్యాపీ బర్త్ డే సినిమాపై అంచనాలు పెరిగాయి. రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా సర్రియల్ కామెడీ అనే కొత్త జానర్ లో తెరకెక్కుతోంది. యాక్షన్ కు కామెడీని జోడిస్తూ, ఓ కొత్త ప్రపంచంలో తీసిన ఫిక్షన్ మూవీ ఇది.

హ్యాపీ బర్త్ డే కంటే, ఒక రోజు ముందే, అంటే రేపే విడుదలవుతున్న సినిమా మాయోన్. సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ హీరోగా నటించిన ఈ సినిమా థ్రిల్లర్, మిస్టరీ జానర్ లో తెరకెక్కింది. రీసెంట్ గా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో భారీగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా చేశారు. అయితే ట్రయిలర్ బాగున్నప్పటికీ, సినిమాపై బజ్ మాత్రం రాలేదు. కంటెంట్ లో మాత్రం విషయం ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక హ్యాపీ బర్త్ డేతో పాటు థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో మా నాన్న నక్సలైజ్, కొండవీడు, రుద్రసింహ, గంధర్వ సినిమాలున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే. వీటిలో గంధర్వ సినిమాకు ఓ మోస్తరుగా పబ్లిసిటీ చేస్తున్నారు. జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాల్లో ఈ వీకెండ్ ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

First Published:  6 July 2022 7:01 AM GMT
Next Story