Telugu Global
NEWS

టీడీపీ అంటే తెలుగు ధనవంతుల పార్టీనేనా? సామాన్యులకు ఈసారి కూడా టికెట్లు దొరకవా!

తెలుగుదేశం మొదటి నుంచి భారీగా నిధులు ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తమ వర్గపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి భారీగానే నిధులు రాబట్టారు. ఇప్పటికీ తెలుగుదేశానికి నిధుల కొరత పెద్దగా లేదనే ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. అయితే గత మూడేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోవడం. పార్టీకి ఆసరాగా ఉండే చాలా మంది వ్యాపారవేత్తలు, ఎన్ఐఆర్‌లు కరోనా కారణంగా వెనకడుగు వేయడంతో కొంచెం […]

టీడీపీ అంటే తెలుగు ధనవంతుల పార్టీనేనా? సామాన్యులకు ఈసారి కూడా టికెట్లు దొరకవా!
X

తెలుగుదేశం మొదటి నుంచి భారీగా నిధులు ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తమ వర్గపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి భారీగానే నిధులు రాబట్టారు. ఇప్పటికీ తెలుగుదేశానికి నిధుల కొరత పెద్దగా లేదనే ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. అయితే గత మూడేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోవడం. పార్టీకి ఆసరాగా ఉండే చాలా మంది వ్యాపారవేత్తలు, ఎన్ఐఆర్‌లు కరోనా కారణంగా వెనకడుగు వేయడంతో కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలు వస్తే ప్రతీ అభ్యర్థికి అన్ని విధాలుగా సహకరించి దగ్గరుండి గెలిపించుకునే చంద్రబాబు ఇప్పుడు రూట్ మార్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీలో అప్పుడే ఎన్నికల హంగామా మొదలైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కోసం ఆయా పార్టీల ఆశావహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార వైసీపీ ఇప్పుడే బయటపడక పోయినా.. కొంత మంది సిట్టింగ్‌లను మార్చేలా కనిపిస్తున్నది. మరోవైపు జనసేన పొత్తులు కుదిరితేనే తప్ప తమ పార్టీ అభ్యర్థులు ఎవరనే విషయం బయటపెట్టేలా లేదు. బీజేపీ టికెట్లన్నీ ఢిల్లీ నుంచి ఖరారు కావల్సిందే. ఇక రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు మాత్రం ఈ సారి టికెట్ల వ్యవహారాన్ని పూర్తిగా డబ్బుతో ముడిపెట్టినట్లు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.

రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు ఉంటేనే టికెట్ వస్తుందని అధిష్టానం చెప్పినట్లు తెలుస్తున్నది. పార్టీ సీనియర్ నాయకులు ఈ విషయాన్ని ముందుగానే ఆశావహులకు చేరవేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ టికెట్ వ్యవహారాలన్నీ గతంతో చంద్రబాబే స్వయంగా చూసుకునే వారు. గత ఎన్నికల్లో కుమారుడు లోకేష్ సూచించిన వారిలో కొంత మందికి టికెట్లు వచ్చాయి. కానీ ఈసారి టికెట్ల వ్యవహారం మొత్తం లోకేష్ చూసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

ఇటీవల కొంత మంది నాయకులు మహానాడు ముగిసిన తర్వాత లోకేష్‌ను కలిశారు. తమకు ఆయా నియోజకవర్గాల్లో మంచి బలం ఉన్నది, ప్రభుత్వ వ్యతిరేకత కూడా పని చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సారి టీడీపీ తరపున టికెట్ ఇప్పించాలని వేడుకున్నారట. అయితే లోకేష్ మాత్రం డబ్బులు ఉంటేనే టికెట్ ఆశించండి. లేకపోతే మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండండి అని చెప్పారట. ఆ తర్వాత ఆ నేతలు చంద్రబాబును కలిసినా.. లోకేష్ మాటే ఫైనల్ అని చెప్పినట్లు సమాచారం.

అధికారంలో లేని సమయంలో పార్టీ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చుపెట్టని నాయకులను కూడా టికెట్ల జాబితాలో నుంచి తప్పిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీ ఎలాగైనా ఖర్చు చేస్తుంది. మరి ప్రతిపక్షంలో ఉన్న మనం ఎన్ని రోజులని ఖర్చు చేయాలి. అందుకే అభ్యర్థులు ఈ సారి డబ్బులు పెట్టుకోవల్సిందేనని తేల్చి చెప్పారని అంటున్నారు.

ఇప్పటికే పార్టీ కార్యకర్త‌ల‌ వరకు ఈ విషయం చేరడంతో వాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. కేవలం డబ్బు ఉన్న వాళ్లకే పార్టీ టికెట్లు ఇస్తారా? ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న సామాన్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలసి కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులనే నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. ప్రతిపక్షంలో ఉంటున్నా.. ఎంతో కష్టపడి పని చేస్తున్న మమ్మల్ని వదిలేసి డబ్బున్న వారికి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే.. ఇక మేం ఎమ్మెల్యేలు అయ్యేది ఎప్పుడని నిలదీస్తున్నారు. మేం ఎప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు, అనుచరులుగానే మిగిలిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారా అని తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  4 July 2022 7:45 PM GMT
Next Story