Telugu Global
MOVIE UPDATES

జేజీఎంలో రష్మిక.. పూరి కొత్త ప్లానింగ్

హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో మరో సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే మరో సినిమా చేయాలని వీళ్లిద్దరూ డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే జనగణమన అనే ప్రాజెక్ట్ ను ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. షార్ట్ కట్ లో దీనికి జీజీఎం అనే టైటిల్ పెట్టారు. నిజానికి ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ఈ షూట్ కంటే, […]

జేజీఎంలో రష్మిక.. పూరి కొత్త ప్లానింగ్
X

హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో మరో సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే మరో సినిమా చేయాలని వీళ్లిద్దరూ డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే జనగణమన అనే ప్రాజెక్ట్ ను ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. షార్ట్ కట్ లో దీనికి జీజీఎం అనే టైటిల్ పెట్టారు.

నిజానికి ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ఈ షూట్ కంటే, లైగర్ ప్రమోషన్ కు ఎక్కువ టైమ్ కేటాయించాలని నిర్ణయించి ఊరుకున్నారు. అలా జేజీఎంను కొన్నాళ్లు పక్కనపెట్టినప్పటికీ, దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ అదే పని మీద ఉన్నాడు.

ఇప్పటికీ కథ-స్క్రీన్ ప్లే పూర్తిచేసిన పూరి.. జేజీఎంకు సంబంధించి డైలాగ్ వెర్షన్ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా సినిమాలో ఓ సన్నివేశంలో వచ్చే ప్రత్యేక గీతం కోసం రష్మికను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్న సంగతి తెలిసిందే.

First Published:  5 July 2022 12:01 AM GMT
Next Story