Telugu Global
MOVIE UPDATES

రాజమౌళి మహాభారతం.. మరో పదేళ్ల తర్వాతే!

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికైనా మహాభారతాన్ని వెండితెరపైకి తీసుకురావాలనేది జక్కన్న డ్రీమ్. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన వెల్లడిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పట్లో అది సెట్స్ పైకి రాదని కూడా చెప్పేశాడు. ఆ ప్రాజెక్టు కోసం కనీసం ఐదేళ్లు సమయం కేటాయించాల్సి ఉంటుందని కూడా గతంలోనే వెల్లడించాడు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరో వివరం బయటపెట్టాడు రాజమౌళి. మహాభారతం ప్రాజెక్టు కంటే ముందు మరో 3-4 సినిమాలు చేయాల్సి […]

రాజమౌళి మహాభారతం.. మరో పదేళ్ల తర్వాతే!
X

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికైనా మహాభారతాన్ని వెండితెరపైకి తీసుకురావాలనేది జక్కన్న డ్రీమ్. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన వెల్లడిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పట్లో అది సెట్స్ పైకి రాదని కూడా చెప్పేశాడు. ఆ ప్రాజెక్టు కోసం కనీసం ఐదేళ్లు సమయం కేటాయించాల్సి ఉంటుందని కూడా గతంలోనే వెల్లడించాడు.

ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరో వివరం బయటపెట్టాడు రాజమౌళి. మహాభారతం ప్రాజెక్టు కంటే ముందు మరో 3-4 సినిమాలు చేయాల్సి ఉందంటున్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సందర్భంగా హాలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ దర్శకుడు.. తను మరో 3-4 సినిమాలు చేయాల్సి ఉందని స్పష్టంచేశాడు. కాబట్టి మహాభారతంపై అప్పుడే స్పందించలేనని క్లారిటీ ఇచ్చాడు.

ఒక్కో సినిమాకు రాజమౌళి కనీసం రెండున్నరేళ్లు గ్యాప్ తీసుకుంటాడు. 4 సినిమాలంటే కనీసం పదేళ్లు పట్టడం గ్యారెంటీ. సో.. రాజమౌళి నుంచి మహాభారతం రావాలంటే మరో పదేళ్లు వెయిట్ చేయాల్సిందే.

ఈ సంగతి పక్కనపెడితే.. మరో 3-4 సినిమాలంటూ రాజమౌళి అంత స్పష్టంగా చెబుతున్నాడంటే, ఆల్రెడీ కమిట్ మెంట్స్ ఉన్నాయని అర్థం. అందులో ఓ బాలీవుడ్ సినిమా కూడా కచ్చితంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ దర్శకుడు మహేష్ బాబుతో మూవీ కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు.

First Published:  5 July 2022 1:01 AM GMT
Next Story