Telugu Global
MOVIE UPDATES

బింబిసార ఫ్రాంచైజీలో ఎన్టీఆర్

నిన్న బింబిసార ట్రయిలర్ గ్రాండ్ గా రిలీజైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని సీక్వెల్స్ వస్తాయని ప్రకటించాడు హీరో కల్యాణ్ రామ్. ఇందులో భాగంగా బింబిసార ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చాడు. “వారం రోజుల కిందట నేను, వశిష్ఠ్ ఓ స్టోరీలైన్ గురించి మాట్లాడుకున్నాం. బింబిసార ఫ్రాంచైజీకి సంబంధించిన ఆ స్టోరీలైన్ చాలా […]

బింబిసార ఫ్రాంచైజీలో ఎన్టీఆర్
X

నిన్న బింబిసార ట్రయిలర్ గ్రాండ్ గా రిలీజైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని సీక్వెల్స్ వస్తాయని ప్రకటించాడు హీరో కల్యాణ్ రామ్. ఇందులో భాగంగా బింబిసార ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

“వారం రోజుల కిందట నేను, వశిష్ఠ్ ఓ స్టోరీలైన్ గురించి మాట్లాడుకున్నాం. బింబిసార ఫ్రాంచైజీకి సంబంధించిన ఆ స్టోరీలైన్ చాలా బాగుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అందులో ఎన్టీఆర్ ఉంటాడు.”

ఇలా బింబిసారకు, ఎన్టీఆర్ కు లింక్ పెట్టాడు కల్యామ్ రామ్. బింబిసారకు సంబంధించి పార్ట్-2, పార్ట్-3, పార్ట్-4 కూడా వచ్చే అవకాశం ఉందంటున్న కల్యాణ్ రామ్.. సోషియో ఫాంటసీ కథలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందని, అదే విధంగా బింబిసార కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అంటున్నాడు.

చిరంజీవికి జగదేకవీరుడు అతిలోకసుందరి, ప్రభాస్ కు బాహుబలి, ఎన్టీఆర్ కు యమదొంగ, రామ్ చరణ్ కు మగధీర.. ఎలాగైతే ది బెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రాలుగా నిలిచాయో.. తన కెరీర్ లో కూడా బింబిసార అలాంటి ఓ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు.

First Published:  4 July 2022 11:01 PM GMT
Next Story