Telugu Global
NEWS

తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్!

భారత దేశంలో కరోనా వైరస్ కు చెందిన సరికొత్త వేరియంట్ ను నిపుణులు గుర్తించారు.ఇజ్రాయెల్, టెల్ హాషోమర్‌ షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ లోని తెలంగాణ రాష్ట్రం సహా పది రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు షే ఫ్లీషాన్ చెప్పారు. దీనిని BA.2.75 సబ్ వేరియంట్ గా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. జులై రెండో తేదీ నాటికి భారత దేశంలో […]

Coronavirus in Telangana
X

భారత దేశంలో కరోనా వైరస్ కు చెందిన సరికొత్త వేరియంట్ ను నిపుణులు గుర్తించారు.ఇజ్రాయెల్, టెల్ హాషోమర్‌ షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత్ లోని తెలంగాణ రాష్ట్రం సహా పది రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు షే ఫ్లీషాన్ చెప్పారు. దీనిని BA.2.75 సబ్ వేరియంట్ గా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు.

జులై రెండో తేదీ నాటికి భారత దేశంలో 69 కేసులను గుర్తించామని అ‍ందులో ఢిల్లీలో1, హర్యానాలో6 , హిమాచల్ ప్రదేశ్ లో3, జమ్ములో 1, కర్ణాటకలో10 , మధ్యప్రదేశ్ లో5, మహారాష్ట్రలో 27, తెలంగాణలో2, ఉత్తర ప్రదేశ్ లో1, పశ్చిమ బెంగాల్ లో13 కేసులున్నాయని ఆయన తెలిపారు.

ఈ వేరియంట్ మరో ఏడు దేశాల్లో కూడా వ్యాపించిందని, ఇది రాబోయే రోజుల్లో ఆందోళ‌నకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

First Published:  5 July 2022 12:15 AM GMT
Next Story