Telugu Global
National

పెట్రోల్ రేట్లకి, తాజ్‌మ‌హల్‌కి సంబంధమేంటి..? మోదీపై అసదుద్దీన్ సెటైర్లు..

“భారత్ లో పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణం షాజహాన్. ఆయన తాజ్ మహల్ కట్టించకుండా.. ఆ డబ్బునంతా దాచిపెట్టి ఇప్పుడున్న ప్రధాని మోదీకి ఇచ్చి ఉంటే భారత్ లో లీటర్ పెట్రోలు 40 రూపాయలకే దొరికేది. అసలు భారత్ లో నిరుద్యోగ సమస్యకి అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రధాన కారణం. ఆ తర్వాత ఔరంగజేబు పాలన కూడా ఇప్పటి నిరుద్యోగానికి కారణంగా నిలిచింది.” ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వేసిన సెటైర్లివి. సమస్యలన్నిటికీ గతపాలకులే […]

పెట్రోల్ రేట్లకి, తాజ్‌మ‌హల్‌కి సంబంధమేంటి..? మోదీపై అసదుద్దీన్ సెటైర్లు..
X

“భారత్ లో పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణం షాజహాన్. ఆయన తాజ్ మహల్ కట్టించకుండా.. ఆ డబ్బునంతా దాచిపెట్టి ఇప్పుడున్న ప్రధాని మోదీకి ఇచ్చి ఉంటే భారత్ లో లీటర్ పెట్రోలు 40 రూపాయలకే దొరికేది. అసలు భారత్ లో నిరుద్యోగ సమస్యకి అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రధాన కారణం. ఆ తర్వాత ఔరంగజేబు పాలన కూడా ఇప్పటి నిరుద్యోగానికి కారణంగా నిలిచింది.” ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వేసిన సెటైర్లివి.

సమస్యలన్నిటికీ గతపాలకులే కారణం అనడం, అందులోనూ ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులపై విషం చిమ్మాలనుకోవడం సరికాదంటూ మోదీకి చురకలంటించారు అసదుద్దీన్. తాజ్ మహల్ కట్టకుండా ఆ డబ్బునంతా దాచి పెట్టి 2014లో ప్రధాని అయిన మోదీకి అప్పగించి ఉంటే.. భారత్ లో పెట్రోల్ రేటు 40 రూపాయలకుగా ఉండేదా అని ప్రశ్నించారాయన.

ఓ కన్ను మొఘలుల వైపు.. ఇంకో కన్ను పాకిస్తాన్ వైపు..
భారత్‌ను కేవలం మొఘల్ చక్రవర్తులే పాలించారా? అని మోదీని సూటిగా ప్రశ్నించారు ఒవైసీ. అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని నిలదీశారు. బీజేపీ ఓ కన్నుతో మొఘలులను, మరో కన్నుతో పాకిస్తాన్‌ను చూస్తుందని ధ్వజమెత్తారు ఒవైసీ. మధ్యప్రదేశ్ లోని ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఒవైసీ, మోదీని టార్గెట్ చేశారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు ఒవైసీ.

ఇటీవల దేశంలో పలు ప్రాంతాలకు పేర్లు మార్చడం, మార్చే ప్రతిపాదనలు చేస్తూ.. బీజేపీ ఇతర పార్టీలను రెచ్చగొడుతోంది. హైదరాబాద్ బహిరంగ సభలో కూడా అమిత్‌ షా.. కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ చేతుల్లోనే ఉందని సెటైర్లు వేశారు. దీనికి గట్టిగా బదులిచ్చారు ఒవైసీ. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవని, మరోవైపు ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోందని, పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. వీటన్నిటిపై ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేని బీజేపీ నేతలు.. గత పాలకులపై నెపం నెట్టేస్తున్నారని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా మొఘలులవైపు వేలెత్తి చూపడం వారి దివాళాకోరు రాజకీయానికి నిదర్శనం అన్నారు ఒవైసీ.

First Published:  5 July 2022 3:47 AM GMT
Next Story