Telugu Global
MOVIE UPDATES

రామ్ చరణ్ కోసం వెయిటింగ్ – కృతి శెట్టి

ఫేవరెట్ హీరో ఎవరో చెప్పమంటే కామన్ ఆడియన్స్ ఠపీమని చెప్పేస్తారు. కానీ ఈ ప్రశ్నకు హీరోయిన్లు వెంటనే సమాధానం చెప్పలేదు. ఓ హీరో పేరు చెబితే మరో హీరోకు కోపం వస్తుందేమో అనే భయం. హీరోయిన్ కృతి శెట్టి మాత్రం ఇలాంటి భయాలు పెట్టుకోలేదు. తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అంటోంది. మెగా పవర్ స్టార్ తో కలిసి నటించడమే ప్రస్తుతానికి తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. “నాకు రామ్ చరణ్ అంటే చాలా […]

రామ్ చరణ్ కోసం వెయిటింగ్ – కృతి శెట్టి
X

ఫేవరెట్ హీరో ఎవరో చెప్పమంటే కామన్ ఆడియన్స్ ఠపీమని చెప్పేస్తారు. కానీ ఈ ప్రశ్నకు హీరోయిన్లు వెంటనే సమాధానం చెప్పలేదు. ఓ హీరో పేరు చెబితే మరో హీరోకు కోపం వస్తుందేమో అనే భయం. హీరోయిన్ కృతి శెట్టి మాత్రం ఇలాంటి భయాలు పెట్టుకోలేదు. తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అంటోంది. మెగా పవర్ స్టార్ తో కలిసి నటించడమే ప్రస్తుతానికి తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది.

“నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా మందికి తెలుసు. అందరికీ చెబుతుంటాను. చరణ్ నా ఫేవరెట్ యాక్టర్. ఉప్పెన సినిమా చేస్తున్నప్పుడు చరణ్ గురించి చాలా ఎక్కువగా విన్నాను. ఆయనో మంచి మనిషి అని అందరూ చెప్పడం విన్నాను. అంతకంటే ముందు నుంచి చరణ్ అంటే అభిమానం. చరణ్ ను ఒక్కసారి కలిశాను. ఉప్పెన సక్సెస్ మీట్ కు వచ్చారు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని అప్పటికే యూనిట్ చరణ్ కు చెప్పారు. నాకు మాత్రం చరణ్ పక్కన నిల్చోవడం చాలా ఎక్సయిటింగ్ అనిపించింది.”

చరణ్ సరసన నటించే అవకాశం వస్తే, తన డ్రీమ్స్ లో ఒక డ్రీమ్ నెరవేరినట్టే అంటోంది కృతి షెట్టి. ఉప్పెనతో హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ, ఆ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయిపోయింది. వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఆమె నటించిన వారియర్ సినిమా విడుదల కాబోతోంది. ఇదే ఊపు కొనసాగిస్తే, కచ్చితంగా చరణ్ సరసన ఆమె ఛాన్స్ దక్కించుకోవడం ఖాయం.

వారియర్ సినిమాలో రామ్ సరసన నటించింది కృతి శెట్టి. లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారంలోనే, రామ్ చరణ్ పై తన మనసులో మాట బయటపెట్టింది ఈ బ్యూటీ.

First Published:  5 July 2022 8:50 AM GMT
Next Story