Telugu Global
MOVIE UPDATES

హ్యాపీ బర్త్ డే.. నాన్-థియేట్రికల్ డీల్స్ ఇవే

కాస్త్ లేట్ అయినప్పటికీ మంచి డీల్స్ సెట్ చేసుకుంది హ్యాపీ బర్త్ డే సినిమా. రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారు. దీనిపై బజ్ కూడా కాస్త తక్కువే. అందుకే నాన్-థియేట్రికల్ క్లోజ్ అవ్వడానికి కాస్త టైమ్ పట్టింది. ఎప్పుడైతే ట్రయిలర్ మార్కెట్లోకి వచ్చిందో, అప్పుడిక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. హ్యాపీ బర్త్ […]

హ్యాపీ బర్త్ డే.. నాన్-థియేట్రికల్ డీల్స్ ఇవే
X

కాస్త్ లేట్ అయినప్పటికీ మంచి డీల్స్ సెట్ చేసుకుంది హ్యాపీ బర్త్ డే సినిమా. రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారు. దీనిపై బజ్ కూడా కాస్త తక్కువే. అందుకే నాన్-థియేట్రికల్ క్లోజ్ అవ్వడానికి కాస్త టైమ్ పట్టింది. ఎప్పుడైతే ట్రయిలర్ మార్కెట్లోకి వచ్చిందో, అప్పుడిక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా క్లోజ్ అయ్యాయి.

హ్యాపీ బర్త్ డే సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ రెండు డీల్స్ కు సంబంధించి అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయి. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ కు ఈ సినిమా ఎప్పుడు వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఓ సినిమాను ఎన్ని వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవ్వాలనే అంశంపై ప్రస్తుతం నిర్మాతల మండలిలో చర్చలు సాగుతున్నాయి. ఆరుగురు పెద్ద హీరోల సినిమాల్ని 8 వారాల వరకు ఓటీటీకి ఇవ్వకూడదని, ఇక మిడ్-రేంజ్ హీరోల సినిమాల్ని 4 వారాలు (28 రోజులు) వరకు ఓటీటీకి ఇవ్వకూడదని నిబంధన పెట్టుకున్నారు.

చిన్న సినిమాల్ని ఎన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కు ఇవ్వొచ్చనేది ఇంకా నిర్ణయించలేదు. మిడ్ రేంజ్ హీరోలకు 4 వారాల లాక్ ఇన్ పీరియడ్ పెట్టుకున్నారు కాబట్టి, చిన్న సినిమాలకు 3 వారాల గడువు పెట్టుకోవచ్చు. సో.. ఎలా చూసుకున్నా.. హ్యాపీ బర్త్ డే సినిమా థియేటర్లలోకి వచ్చిన 3-4 వారాలకే నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమౌతుందన్నమాట.

First Published:  4 July 2022 10:01 PM GMT
Next Story