Telugu Global
MOVIE UPDATES

ఎఫ్3 క్లోజింగ్ కలెక్షన్లు ఇవే

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా రిజల్ట్ ఏంటి? యూనిట్ ఈ సినిమాను సూపర్ హిట్ అంటుంది. చాలామంది మాత్రం కాస్ట్ ఫెయిల్యూర్ అంటారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఫుట్ ఫాల్ పెరగలేదని ట్రేడ్ అంటోంది. ఆ సినిమా కథ ముగిసింది కదా. మరి ఇప్పుడు మళ్లీ కొత్తగా చర్చ ఎందుకు? అక్కడికే వస్తున్నాం. టాలీవుడ్ లో 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లో టాలీవుడ్ పరిస్థితేంటి అంటూ చాలా విశ్లేషణలు, కథనాలు […]

ఎఫ్3 క్లోజింగ్ కలెక్షన్లు ఇవే
X

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా రిజల్ట్ ఏంటి? యూనిట్ ఈ సినిమాను సూపర్ హిట్ అంటుంది. చాలామంది మాత్రం కాస్ట్ ఫెయిల్యూర్ అంటారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఫుట్ ఫాల్ పెరగలేదని ట్రేడ్ అంటోంది. ఆ సినిమా కథ ముగిసింది కదా. మరి ఇప్పుడు మళ్లీ కొత్తగా చర్చ ఎందుకు? అక్కడికే వస్తున్నాం.

టాలీవుడ్ లో 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లో టాలీవుడ్ పరిస్థితేంటి అంటూ చాలా విశ్లేషణలు, కథనాలు వచ్చాయి. ఏ సినిమా హిట్టయింది, ఏ సినిమా ఫ్లాప్ లాంటివన్నీ చెప్పుకొచ్చారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. కొంతమంది ఎఫ్3 సినిమాను ఫ్లాప్ అని చెబితే, మరికొంతమంది మాత్రం ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ ఆ సినిమాను ప్రస్తావించడం మానేశారు.

ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది యూనిట్. అందుకే తొలిసారిగా క్లోజింగ్ కలెక్షన్లను వెల్లడించింది. ఎఫ్3 సినిమా క్లోజింగ్ నాటికి వరల్డ్ వైడ్ 134 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక షేర్ లెక్కల్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చినట్టు ఎనౌన్స్ చేశారు. అలా తమ సినిమా సక్సెస్ అని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తన కెరీర్ లో నిర్మాత దిల్ రాజు, ఓ సినిమాకు క్లోజింగ్ కలెక్షన్లు ప్రకటించడం ఇదే తొలిసారి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన క్లోజింగ్ షేర్స్ ఇలా ఉన్నాయి..
నైజాం – 20.57cr
ఉత్తరాంద్ర – 7.48cr
ఈస్ట్ – 4.18cr
వెస్ట్ – 3.41cr
కృష్ణా – 3.23cr
గుంటూరు- 4.18cr
నెల్లూరు- 2.31cr
సీడెడ్- 8.58cr
కర్ణాటక- 5Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2Cr
ఓవర్సీస్ – 10Cr

First Published:  5 July 2022 8:48 AM GMT
Next Story