Telugu Global
MOVIE UPDATES

షూటింగ్ లో గాయపడ్డ విశాల్..!

తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డాడు. ఆదివారం సాయంత్రం చెన్నై శివార్లలోని పొళిచ్చలూరులో విశాల్ హీరోగా నటిస్తున్న లాఠీ సినిమా క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో వందల మంది ఫైటర్స్ ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. విశాల్, ఫైటర్స్ మధ్య ఫైట్ షూట్ చేస్తుండగా, అనుకోకుండా విశాల్ కాలికి గాయం అయ్యింది. గాయం వల్ల విశాల్ నిల్చొవడానికి కూడా సాధ్యం కాకపోవడంతో అక్కడే ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అనంతరం […]

vishal
X

తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డాడు. ఆదివారం సాయంత్రం చెన్నై శివార్లలోని పొళిచ్చలూరులో విశాల్ హీరోగా నటిస్తున్న లాఠీ సినిమా క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో వందల మంది ఫైటర్స్ ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు.

విశాల్, ఫైటర్స్ మధ్య ఫైట్ షూట్ చేస్తుండగా, అనుకోకుండా విశాల్ కాలికి గాయం అయ్యింది. గాయం వల్ల విశాల్ నిల్చొవడానికి కూడా సాధ్యం కాకపోవడంతో అక్కడే ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అనంతరం విశాల్ ని నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ఆయనకు ఎక్స్ రే తీయగా కాలి ఎముకకు ఎలాంటి గాయం కాలేదని నిర్ధారణ అయ్యింది. ఫిజియోథెరఫీ చేస్తే చాలని వైద్యులు తెలిపారు. విశాల్ కి షూటింగ్స్ సమయంలో గాయపడటం ఇదే తొలిసారి కాదు. పలు సార్లు ఫైట్స్ తీసే క్రమంలో గాయపడ్డాడు.

ఇదే సినిమా షూటింగ్ కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లో చిత్రీకరించారు. అప్పుడు కూడా ఓ ఫైట్ సీన్ లో ఫైటర్ సీసా విసిరేసే క్రమంలో అది విశాల్ ను బలంగా తాకి అస్పత్రి పాలయ్యాడు.

ఇప్పుడు మరోసారి విశాల్ గాయపడటంతో లాఠీ సినిమా చిత్రీకరణ నిలిపివేశారు. రానా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సునైనా హీరోయిన్ గా నటిస్తోంది. లాఠీ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో తెరకెక్కుతోంది. ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విశాల్ ఈ సినిమా హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నాడు.

First Published:  4 July 2022 12:19 AM GMT
Next Story