Telugu Global
MOVIE UPDATES

సెట్ రెడీ.. కథ రెడీ.. మహేష్ ఏమంటాడో?

చాన్నాళ్లుగా నలుగుతున్న మహేష్-త్రివిక్రమ్ సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. నిన్న వీళ్లిద్దరి మధ్య కథాచర్చలు పూర్తయ్యాయి. మహేష్ కు ఫైనల్ నెరేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. అయితే ఇది కేవలం కథ-స్క్రీన్ ప్లే మాత్రమే. దీనికి మహేష్ బాబు ఓకే చెబితే, అప్పుడు డైలాగ్ వెర్షన్ మొదలుపెడతాడు త్రివిక్రమ్. మరోవైపు ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టుడియోలో సెట్ కూడా రెడీ అయింది. స్వయంగా మహేష్ ఈ సెట్ ను సందర్శించి మెచ్చుకున్నాడు. మహేష్ తో పాటు […]

trivikram-went-to-germany
X

చాన్నాళ్లుగా నలుగుతున్న మహేష్-త్రివిక్రమ్ సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. నిన్న వీళ్లిద్దరి మధ్య కథాచర్చలు పూర్తయ్యాయి. మహేష్ కు ఫైనల్ నెరేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. అయితే ఇది కేవలం కథ-స్క్రీన్ ప్లే మాత్రమే. దీనికి మహేష్ బాబు ఓకే చెబితే, అప్పుడు డైలాగ్ వెర్షన్ మొదలుపెడతాడు త్రివిక్రమ్.

మరోవైపు ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టుడియోలో సెట్ కూడా రెడీ అయింది. స్వయంగా మహేష్ ఈ సెట్ ను సందర్శించి మెచ్చుకున్నాడు. మహేష్ తో పాటు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ కూడా ఉన్నాడు.

ఇలా కథ, సెట్ రెండూ సిద్ధంగా ఉన్నాయి. అయితే మహేష్ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ చెప్పిన నెరేషన్ పై బాగా ఆలోచించి, త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడు మహేష్. ఒక్కసారి మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే సినిమా సెట్స్ పైకి వెళ్లినట్టే. ఈ మేరకు ఇతర ఆర్టిస్టుల కాల్షీట్లను రెడీ చేసి పెట్టారు.

సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుంది. సెకెండ్ హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. కృతిశెట్టి పేరు వినిపిస్తున్నప్పటికీ అవన్నీ పుకార్లు మాత్రమే. మరోవైపు తమన్, ఈ సినిమాకు సంబంధించి పాటల పని ప్రారంభించాడు. రీసెంట్ గా అమెరికా వెళ్లి కొన్ని ట్యూన్స్ వినిపించాడు తమన్. ప్రస్తుతం వాటిపైనే రీవర్క్ మొదలుపెట్టాడు.

ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు నడుస్తున్నాయి. మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం అంతా వెయిటింగ్.

First Published:  4 July 2022 8:01 AM GMT
Next Story