Telugu Global
National

స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రమెక్కాడు.. ఎందుకంటే..

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. ద్విచక్ర వాహనదారుల అవస్థలైతే వర్ణనాతీతం.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇళ్లలో వంటలు చేసుకోలేనివాళ్లకు, అత్యవసరంగా ఫుడ్ అవసరమైనవారికి స్విగ్గీ వంటి డోర్ డెలివరీ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. కానీ నీళ్లతో నిండిన రోడ్లలో బైకులపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేయాలంటే అది కష్టమైన పనే ! ఈ డెలివరీ బాయ్ లకు అగ్నిపరీక్షే అవుతుంది. ద్విచక్రవాహనాలపై వెళ్లి ఫుడ్ పాకెట్స్ ఇవ్వడం సకాలంలో […]

Swiggy
X

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. ద్విచక్ర వాహనదారుల అవస్థలైతే వర్ణనాతీతం.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇళ్లలో వంటలు చేసుకోలేనివాళ్లకు, అత్యవసరంగా ఫుడ్ అవసరమైనవారికి స్విగ్గీ వంటి డోర్ డెలివరీ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. కానీ నీళ్లతో నిండిన రోడ్లలో బైకులపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేయాలంటే అది కష్టమైన పనే ! ఈ డెలివరీ బాయ్ లకు అగ్నిపరీక్షే అవుతుంది.

ద్విచక్రవాహనాలపై వెళ్లి ఫుడ్ పాకెట్స్ ఇవ్వడం సకాలంలో అయ్యే పని కాదు. అందుకే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. బైక్ బదులు గుర్రమెక్కి సవారీ చేస్తూ డ్యూటీ చేయాలనుకున్నాడు. అంతే ! నిజంగానే తన ఐడియాను అమల్లో పెట్టి గుర్రమెక్కి ముంబై వాసులకు ఫుడ్ డెలివరీ చేయడం మొదలు పెట్టాడు.

ఈ సరికొత్త ‘మోడ్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్’ దృశ్యాన్ని యూ ట్యూబర్ యూజర్ ఒకరు వీడియో తీసి వదిలాడు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవడం ప్రారంభించింది.

ఇక నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించారు. ఈ డెలివరీ బాయ్ ఆలోచన అద్భుతంగా ఉందని ఒకరంటే.. అసలు ఇలా ఫుడ్ సప్లయ్ చేయాలని స్విగ్గీ యాజమాన్యం ఇతడిని అనుమతించిందా.. అని మరొకరు ప్రశిస్తున్నారు. ఇంకొకరు ఈ గుర్రమెక్కడిది..? ఈ బాయ్ కి గుర్రపు సవారీ కూడా వచ్చా ..? మధ్యలో అది ‘మారాం’ చేసి మొండికేస్తే ఏం చేస్తాడు లాంటి ప్రశ్నలతో హోరెత్తించారు. ఏది ఏమైనా భారీ వర్షాలు పడుతున్నా .. తడుస్తూనే గుర్రం పై వెళ్తూ అవసరమైనవి డోర్ డెలివరీ చేస్తున్న ఈ బాయ్ ‘సాహసాన్ని’ మెచ్చుకోవలసిందే అంటున్నవారూ లేకపోలేదు.

2014 లో ఏర్పాటైన స్విగ్గీ సంస్థకు దేశంలోని 500 నగరాల్లో రెండు లక్షలకు పైగా రెస్టారెంట్ పార్ట్ నర్స్ ఉన్నారు. స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇన్స్ టా మార్ట్ లో 700 మిలియన్ డాలర్లను విడుదల చేసినట్టు ఈ సంస్థ గత డిసెంబరులో ప్రకటించింది. కోట్లాది ప్రజలు దీని సేవలను అందుకుంటున్నారు.

First Published:  4 July 2022 4:41 AM GMT
Next Story