Telugu Global
MOVIE UPDATES

మరో సినిమా ప్రకటించిన సుమంత్

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సుమంత్. ఇప్పటికే అహం రీబూట్ అనే డిఫరెంట్ సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు సుమంత్. దీంతో పాటు వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్-కామెడీ జానర్ లో మరో సినిమా కూడా రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమా ఎనౌన్స్ చేశాడు సుమంత్. “సుబ్రహ్మణ్యపురం”, “లక్ష్య” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు […]

మరో సినిమా ప్రకటించిన సుమంత్
X

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సుమంత్. ఇప్పటికే అహం రీబూట్ అనే డిఫరెంట్ సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు సుమంత్. దీంతో పాటు వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్-కామెడీ జానర్ లో మరో సినిమా కూడా రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమా ఎనౌన్స్ చేశాడు సుమంత్.

“సుబ్రహ్మణ్యపురం”, “లక్ష్య” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన “సుబ్రహ్మణ్యపురం” సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో సంతోష్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు సుమంత్. ఈ కొత్త చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ నిర్మిస్తున్నాడు.

పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా రాబోతోంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  4 July 2022 6:01 AM GMT
Next Story