Telugu Global
MOVIE UPDATES

రుద్రుడు రిలీజ్ డేట్ ఫిక్స్

తన కథల్లో కొత్తదనంతో పాటు యాక్షన్-హారర్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు లారెన్స్. హారర్ మిస్సయినా యాక్షన్ మస్ట్ గా ఉండాల్సిందే. ఇదే ఫార్ములాలో లారెన్స్ చేస్తున్న కొత్త సినిమా రుద్రుడు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. తాజాగా సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2022 క్రిస్మస్‌ కానుకగా ఈ […]

రుద్రుడు రిలీజ్ డేట్ ఫిక్స్
X

తన కథల్లో కొత్తదనంతో పాటు యాక్షన్-హారర్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు లారెన్స్. హారర్ మిస్సయినా యాక్షన్ మస్ట్ గా ఉండాల్సిందే. ఇదే ఫార్ములాలో లారెన్స్ చేస్తున్న కొత్త సినిమా రుద్రుడు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. తాజాగా సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సంధర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా లారెన్స్ చూస్తున్న లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఇలాంటి గెటప్, సెటప్స్ లారెన్స్ కు బాగా సూట్ అవుతాయి.

‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి కూడా భారీ స్పందన వచ్చింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు లారెన్స్.

First Published:  4 July 2022 7:01 AM GMT
Next Story