Telugu Global
NEWS

తెలంగాణ: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక‌ పరీక్ష తేదీలు, వివరాలు

తెలంగాణ ప్రభుత్వం వరసగా అనేక పోస్టులను భర్తీ చేస్తోంది. వరస నోటిఫికేషన్ల తో నిరుద్యోగుల్లో సంతోషం నెలకొంది. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 25న పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులను, 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు, ఆగస్టు […]

తెలంగాణ: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక‌ పరీక్ష తేదీలు, వివరాలు
X

తెలంగాణ ప్రభుత్వం వరసగా అనేక పోస్టులను భర్తీ చేస్తోంది. వరస నోటిఫికేషన్ల తో నిరుద్యోగుల్లో సంతోషం నెలకొంది. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 25న పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

మొత్తంగా 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులను, 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు, ఆగస్టు 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక‌ పరీక్షలు జరుగనున్నాయి. ఎస్సై అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. రాత పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని తెలిపింది.

ఎస్సై పోస్టులకు హైదరాబాద్‌ సహా 20 పట్టణాల్లో, కానిస్టేబుల్‌ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఎస్సై పోస్టులకు 2.45 లక్షల మంది, కానిస్టేబుల్‌ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష, ఇతర వివరాలు, హాల్ టికెట్లను www.tslprb.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

First Published:  4 July 2022 5:59 AM GMT
Next Story