Telugu Global

మోదీ సమావేశం హైదరాబాద్‌లో వాహనదారులకు పీడకలగా మారింది

సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం మొత్తం హైదరాబాద్ నగర ప్రయాణీకులకు పీడకలలా మారాయి. రోడ్డు మీద వెళ్ళడం కష్టతరమైన పరీక్ష అయిపోయింది. బీజేపీ బహిరంగసభ కోసం ట్రాఫిక్ పోలీసులు ఆదివారం మధ్యహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధించారు, మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసి నుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు అనేక మంది వివిఐపిలు సభా వేదిక వద్దకు చేరుకోవడానికి […]

మోదీ సమావేశం హైదరాబాద్‌లో వాహనదారులకు పీడకలగా మారింది
X

సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం మొత్తం హైదరాబాద్ నగర ప్రయాణీకులకు పీడకలలా మారాయి. రోడ్డు మీద వెళ్ళడం కష్టతరమైన పరీక్ష అయిపోయింది.

బీజేపీ బహిరంగసభ కోసం ట్రాఫిక్ పోలీసులు ఆదివారం మధ్యహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధించారు, మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసి నుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు అనేక మంది వివిఐపిలు సభా వేదిక వద్దకు చేరుకోవడానికి మార్గంలో అనేక ఆంక్షలు విధించారు. సమావేశానికి వెళ్లేవారిని మినహాయించి, సాధారణ ప్రజలను ఈ మార్గంలో అనుమతించలేదు. ట్రాఫిక్ పోలీసులు టివోలి క్రాస్‌రోడ్, ప్లాజా క్రాస్‌రోడ్‌ల మధ్య మార్గాన్ని కూడా మూసివేశారు. పరేడ్ గ్రౌండ్స్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలోని రోడ్లలో వాహనదారులను అనుమతించలేదు.

సికింద్రాబాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ఎంజి రోడ్డు, ఆర్‌పి రోడ్డు, ఎస్‌డి రోడ్లలో మధ్యాహ్నం నుండే పోలీసులు సాధారణ ట్రాఫిక్ ను పూర్తిగా పరిమితం చేశారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ చుట్టుపక్కల కాలనీల్లో ఉంటున్న నివాసితులు తమ కాలనీ రోడ్లను పోలీసులు బ్లాక్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రశాంత్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, బేగంపేట, రసూల్‌పురా, సింధీ కాలనీ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు కూడా ఇబ్బందులు పడ్డారు.

“మోదీ సభకు వచ్చిన ప్రజలు తమ వాహనాలను కాలనీలలో కూడా అస్తవ్యస్తంగా పార్క్ చేశారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు పెద్దగా సహాయం చేయలేదు” అని రసూల్‌పురా నివాసి యశ్వంత్ ఫిర్యాదు చేశాడు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్స్, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల దగ్గర కూడా వాహనాలను పెద్దగా అనుమతించలేదు.

పంజాగుట్ట, అమీర్‌పేట తదితర పశ్చిమ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడం కష్టతరంగా మారింది. “మేము ఎక్కువ డబ్బు ఖర్చు చేయడమే కాదు, MS మక్తా నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వెళ్లడానికి మాకు రెండు గంటల సమయం పట్టింది” అని విశాఖపట్నంకు వెళ్ళడానికి స్టేషన్ కు వెళ్ళిన గోపాల్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

టీఎస్‌ఆర్‌టీసీ బస్సులను కూడా దారి మళ్లించారు. “ప్రయాణ దూరం పెరిగింది, మేము ఎక్కువసేపు బస్సులోనే కూర్చోవలసి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గం చాలా దూరం ఉండడంతో పాటు పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఉన్నందున కొన్ని బస్సులను పంజాగుట్ట, సికింద్రాబాద్‌లో నిలిపివేశారు” అని ఒక ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు.

ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సుమారు 1,000 మంది ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులను మోహరించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. “వివిధ కారణాల వల్ల కొన్ని చోట్ల సమస్యలు వచ్చాయి.” అని సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

First Published:  3 July 2022 8:51 PM GMT
Next Story