Telugu Global
MOVIE UPDATES

సత్యదేవ్ సినిమాకు కృష్ణమ్మ టైటిల్ ఫిక్స్..!

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు. సత్య దేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్, ఇస్మార్ట్ శంకర్, బ్రోచేవరెవారురా, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆచార్య, గాడ్సే సినిమాల్లో నటించిన సత్య దేవ్ ప్రస్తుతం వి. వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో […]

Krishnamma Movie
X

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు.

సత్య దేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్, ఇస్మార్ట్ శంకర్, బ్రోచేవరెవారురా, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.

ఈ ఏడాది ఇప్పటికే ఆచార్య, గాడ్సే సినిమాల్లో నటించిన సత్య దేవ్ ప్రస్తుతం వి. వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు కృష్ణమ్మ అనే టైటిల్ ఖరారు చేశారు.

అలాగే సోమవారం సత్య దేవ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సత్య దేవ్ కత్తి పట్టుకుని నది ఒడ్డుపై నిల్చున్నాడు.

కింద దారలా రక్తం కనిపిస్తోంది.దీనిని బట్టి ఈ సినిమా పక్కా యాక్షన్ మూవీలా అర్థం అవుతోంది. కత్తి పట్టుకున్న లుక్ లో సత్య దేవ్ ఆకట్టుకున్నాడు.

పలు డిఫరెంట్ రోల్స్ చేసిన సత్య దేవ్ పూర్తిగా ఒక యాక్షన్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

కృష్ణమ్మ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. సత్యదేవ్ ఈ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.

First Published:  4 July 2022 12:03 PM GMT
Next Story