Telugu Global
MOVIE UPDATES

కృష్ణమ్మ ఫస్ట్ లుక్.. డిఫరెంట్ గెటప్ లో సత్యదేవ్

వైవిధ్యమైన పాత్రలు, డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్నాడు సత్యదేవ్. ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా, అతడి కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఆ సినిమా పేరు కృష్ణమ్మ. టైటిల్ పోస్టర్ తో పాటు, హీరో లుక్ కూడా రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీ […]

కృష్ణమ్మ ఫస్ట్ లుక్.. డిఫరెంట్ గెటప్ లో సత్యదేవ్
X

వైవిధ్యమైన పాత్రలు, డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్నాడు సత్యదేవ్. ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా, అతడి కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఆ సినిమా పేరు కృష్ణమ్మ. టైటిల్ పోస్టర్ తో పాటు, హీరో లుక్ కూడా రిలీజ్ చేశారు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీ వీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. కత్తి పట్టుకుని నిలుచున్న సత్యదేవ్ ఫొటోను ఫస్ట్ లుక్ కింద రిలీజ్ చేశారు. మంచి, చెడు కలయిక నది నడత… పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే భావాన్ని కలిగిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

First Published:  4 July 2022 2:47 AM GMT
Next Story