Telugu Global
MOVIE UPDATES

గాడ్ ఫాదర్.. చిరంజీవి ‘మెగా’ లుక్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫొటోను ఫశ్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఇక చిరంజీవి పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ వీడియో అదిరింది. ఒక ఆఫీస్ వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో […]

గాడ్ ఫాదర్.. చిరంజీవి ‘మెగా’ లుక్
X

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫొటోను ఫశ్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశారు.

ఇక చిరంజీవి పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ వీడియో అదిరింది. ఒక ఆఫీస్ వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో రావడం, సునీల్ కార్ డోర్ తీయగా గాడ్ ఫాదర్ గా చిరంజీవి కారు నుండి బయటకు వచ్చి, ఆఫీస్‌ లోకి ఠీవిగా నడుచుకుంటూ వచ్చారు.

గాడ్ ఫాదర్ టైటిల్ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయింది. ఈ గ్లింప్స్ వీడియోకి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చిరు లుక్ ను మరింత ఎలివేట్ చేసింది.

గాడ్‌ఫాదర్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించననున్నారు.

ఈ ఏడాది దసరా సందర్భంగా గాడ్‌ఫాదర్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

First Published:  4 July 2022 9:11 AM GMT
Next Story