Telugu Global
NEWS

పాపం బండి సంజయ్…అనుకున్నదొకటి అయినదొకటి

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాని కోసం అనేక ఎత్తుగడ‌లు వేస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో జరిపించడం ద్వారా పార్టీ బలపడొచ్చని ఆ పార్టీ ఎత్తు వేసింది. పైగా ఆ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున బీజేపీ లో […]

Bandi Sanjay
X

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాని కోసం అనేక ఎత్తుగడ‌లు వేస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో జరిపించడం ద్వారా పార్టీ బలపడొచ్చని ఆ పార్టీ ఎత్తు వేసింది.

పైగా ఆ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున బీజేపీ లో చేర్పించాలని ప్లాన్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్. అందుకోసం కొంత కాలంగా దాదాపు వంద మంది టీఆరెస్, కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్నారట.

అటు టీఆరెస్, ఇటు కాంగ్రెస్ పార్టీలో అసంత్రుప్తిగా ఉన్న ముఖ్య నేతలు కొందరిని టార్గెట్ చేసుకొని బీజేపీ నేతలు పావులు కదిపారు. వంద మంది కాకపోయినా కనీసం 50 మంది ముఖ్య నేతలు తమ అనుచరగణంతో బీజేపీలో చేరుతారని నమ్మకంగా ఉన్నారు బండిసంజయ్. అయితే ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరోటి.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్ప మరే నాయకుడు బీజేపీ వైపు కన్నెత్తి చూడలేదు. కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా సాంకేతికంగా ఏ పార్టీలోనూ లేరు. ఇక బండి సంజయ్, డీకే అరుణ, వివేక్ లాంటి వాళ్ళ‌ టచ్ లో ఉన్న కొంత మంది టీఆరెస్, కాంగ్రెస్ నాయకులు చివరి నిమిషంలో వాళ్ళకు హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. బీజేపీలో చేరడం వల్ల తమ‌ రాజకీయ భవిష్య‌త్తుకు ఏ మాత్రం ఉపయోగం లేదని భావించిన ఆ నాయకులు రెండు రోజుల ముందునుంచె బీజేపీ నాయకుల ఫోన్లకు అందుబాటులో లేకుండా పోయారట.

చదువు చారెడు బలపాలు దోసెడు అన్నట్టు బీజేపీది ప్రచారమే తప్ప క్షేత్ర స్థాయిలో బలం లేదన్న నిజాన్ని గ్రహించిన ఇతర పార్టీల నాయకులు బీజేపీ వైపు చూడడానికి కూడా ఇష్టపడటం లేదట. ఎంతో ఆశతో, ఎన్నో నమ్మకాలతో వంద మందిపై నమ్మకం పెట్టుకున్న బండిసంజయ్ చివరి నిమిషంలో వాళ్ళిచ్చిన షాక్ తో కళ్ళు తేలేశాడట. అనేక చేరికలుంటాయని జాతీయ నాయకులకు ముందే చెప్పిన సంజయ్ చివరకు వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నారట. తమ పార్టీలో చేరడానికి ఒప్పుకొని చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన వాళ్ళపై ఆగ్రహంగా ఉన్నారట బండి సంజయ్.

First Published:  4 July 2022 2:12 AM GMT
Next Story