Telugu Global
MOVIE UPDATES

‘అల్లూరి’గా అదిరిపోయిన శ్రీవిష్ణు ..!

యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు చాలా డిఫరెంట్. ఆయన నటించిన ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. అన్ని సినిమాలు విలక్షణంగా ఉంటాయి. నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, ప్రేమ ఇష్క్ కాదల్, అప్పట్లో ఒకడుండేవాడు, ఉన్నది ఒక్కటే జిందగీ, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, భళాతందనాన వంటి ప్రత్యేకమైన చిత్రాల్లో నటించాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీవిష్ణు అల్లూరి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కయదు లోహర్ నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ […]

Sree Vishnu
X

యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు చాలా డిఫరెంట్. ఆయన నటించిన ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. అన్ని సినిమాలు విలక్షణంగా ఉంటాయి. నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, ప్రేమ ఇష్క్ కాదల్, అప్పట్లో ఒకడుండేవాడు, ఉన్నది ఒక్కటే జిందగీ, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, భళాతందనాన వంటి ప్రత్యేకమైన చిత్రాల్లో నటించాడు శ్రీవిష్ణు.

ప్రస్తుతం శ్రీవిష్ణు అల్లూరి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కయదు లోహర్ నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో తొలిసారిగా శ్రీవిష్ణు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇవాళ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి మూవీ నుంచి ఫస్ట్ వారెంట్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీవిష్ణు కోర మీసంతో మాస్ లుక్ లో అదిరిపోయాడు. పోలీస్ లుక్ లో బాగా సూట్ అయ్యాడు శ్రీవిష్ణు. టీజర్ లో చూపిన యాక్షన్ స్టంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అనే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమై ఆకట్టుకునేలా ఉంది. చివర్లో ‘అల్లూరి సీతారామరాజు.. సబ్ ఇన్ స్పెక్టర్ పోలీస్’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

హర్ష వర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డ్యూటీలో కొత్తగా చేరిన ఒక పోలీస్ ఆఫీసర్ తనకు ఎదురైనా సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడు. క్రైమ్ రేట్ ని ఎలా కంట్రోల్ చేయగలిగాడు.. అనే అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల ఎప్పుడన్నది అతి త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీవిష్ణు తొలిసారి ఒక యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

First Published:  4 July 2022 12:24 PM GMT
Next Story