Telugu Global
MOVIE UPDATES

అల్లూరి మూవీ టీజర్ రివ్యూ

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి వెరైటీగా ఈ టీజర్ కు ఫస్ట్ వారెంట్ అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి. ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. టీజర్ విషయానికొస్తే.. శ్రీవిష్ణు పోలీస్ గా […]

అల్లూరి మూవీ టీజర్ రివ్యూ
X

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి వెరైటీగా ఈ టీజర్ కు ఫస్ట్ వారెంట్ అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి. ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా.

టీజర్ విషయానికొస్తే.. శ్రీవిష్ణు పోలీస్ గా ఎంట్రీ ఇస్తూ ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్’ అనే వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. సినిమాలో కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ కొన్నింటిని అక్కడక్కడ చూపించారు. ఓవరాల్ గా ఇదొక సీరియస్ మూవీ అనే విషయాన్ని టీజర్ తో స్పష్టం చేశారు.

తొలిసారి పోలీస్ గా కనిపించిన శ్రీవిష్ణు, తన లుక్ తో ఆకట్టుకున్నాడు కానీ, డైలాగ్ డెలివరీతో మాత్రం మెప్పించలేకపోయాడు. ఎందుకంటే, అతడి గొంతు గంభీరంగా ఉండదు కాబట్టి. ఫైట్స్ మాత్రం బాగానే చేశాడు. టీజర్ లో ఫ్రేమ్స్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాయి. చివర్లో నక్సల్స్ దగ్గరికెళ్లి ”అల్లూరి.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ” అంటూ శ్రీవిష్ణు డైలాగ్ చెప్పడం, ఆ వెంటనే నక్సల్స్ తుపాకులు ఎక్కుపెట్టే సీన్ బాగుంది.

శ్రీ విష్ణు ట్రాన్సఫర్మేషన్, రాజ్ తోట కెమెరా వర్క్ , హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవ్వనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు మేకర్స్.

First Published:  4 July 2022 2:50 AM GMT
Next Story