Telugu Global
MOVIE UPDATES

విశాల్ లాఠీ మూవీ షూటింగ్ అప్ డేట్స్

విశాల్ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా (రాజ రాజ చోర ఫేమ్) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఫైట్ […]

విశాల్ లాఠీ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

విశాల్ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా (రాజ రాజ చోర ఫేమ్) హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఫైట్ మస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఈ భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారు. దీనికి సంబంధించిన మేకింగ్ స్టిల్స్ లో ఖాకీ యూనిఫామ్ లో కనిపిస్తున్నాడు విక్రమ్.

సినిమాకు సంబంధించి ఆల్రెడీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. అన్ని భాషల్లో ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి ఉంది. విశాల్‌ ఆ ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారన్నది ఈ సినిమాలో చర్చించారు. ఈ చిత్రంలో విశాల్, ఫుల్ లెంగ్త్ యాక్షన్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. సినిమా సెకండాఫ్ లో వచ్చే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 July 2022 2:22 AM GMT
Next Story