Telugu Global
National

అప్పుడు మేడిన్‌ ఇండియా.. ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌

శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో భారత దేశాన్ని నెంబర్‌-1 గా నిలపడమే.. మనదేశ యువత ముందున్న లక్ష్యం అని చెప్పారు డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి. 75 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం భారత్ అని.. ఆ యువ శక్తిని, మేథో సంపత్తిని సమృద్ధిగా వినియోగించుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో ఐఐటీ పూర్తి చేసుకున్న వారిలో 75 శాతం మంది విదేశాలకు వెళ్లిపోయేవారని, కానీ ఇప్పుడు ఆ […]

Satheesh-Reddy
X

శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో భారత దేశాన్ని నెంబర్‌-1 గా నిలపడమే.. మనదేశ యువత ముందున్న లక్ష్యం అని చెప్పారు డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి. 75 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం భారత్ అని.. ఆ యువ శక్తిని, మేథో సంపత్తిని సమృద్ధిగా వినియోగించుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో ఐఐటీ పూర్తి చేసుకున్న వారిలో 75 శాతం మంది విదేశాలకు వెళ్లిపోయేవారని, కానీ ఇప్పుడు ఆ మేథో వలస తగ్గిపోయిందని.. ఐఐటియన్లలో 75 శాతం మంది ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. ఇది మన దేశం సాధించిన ప్రగతికి నిదర్శనం అని అన్నారు సతీష్ రెడ్డి.

మేక్ ఫర్ వరల్డ్..

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గత ఏడేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు డాక్టర్ సతీష్ రెడ్డి. మన అవసరాలకు మించి ఉత్పత్తులను తయారుచేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

ఇప్పటివరకు మేడ్‌ ఇన్‌ ఇండియా దిశగా మన ప్రయాణం ఉందని, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ దిశగా మన ప్రయోగాలు, ఆవిష్కరణలు తయారు చేస్తున్నామని చెప్పారు.

ప్రపంచ దేశాల అవసరాల కోసం తయారయ్యే ఉత్పత్తులకు భారత్ కేంద్రం అవుతోందని, ప్రపంచానికి మనమే దిక్సూచి కాబోతున్నామని చెప్పారు. ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్‌ క్షిపణిలో ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలన్నింటినీ భారత్‌ లోనే తయారు చేశామని, ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్‌ ‘టోడ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌’ ని అభివృద్ధి చేసింది కూడా మనమేనని చెప్పారు సతీష్ రెడ్డి.

త్వరలోనే భారత్‌ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతోందన్నారు సతీష్ రెడ్డి. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, కీలకమైన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై డీఆర్డీవో దృష్టి పెట్టిందని చెప్పారు. 39 వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయడం డీఆర్డీవో లక్ష్యం అని చెప్పారాయన.

సరికొత్త ఆలోచనలు ఉన్నవారిని, పరిశోధనలు చేస్తున్న రక్షణ శాఖ ప్రోత్సహిస్తోందని చెప్పారు సతీష్ రెడ్డి. దేశంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌ లను ప్రోత్సహించేందుకు డీఆర్డీవో ‘డేర్‌ టు డ్రీం’ పేరిట వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తోందని చెప్పారు. మంచి స్టార్టప్‌ లు, ఆలోచనలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల వరకు ప్రైజ్‌ మనీ ఇస్తోందని వివరించారు. ఆయా ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, మెకానిజం కూడా డీఆర్డీవో అందిస్తుందని అన్నారు.

First Published:  3 July 2022 8:13 AM GMT
Next Story