Telugu Global
NEWS

అల్లూరి కుటుంబ సభ్యులతో భేటీకానున్న ప్రధాని మోడీ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మోడీ సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వస్తారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులలో ప్రధాని మోడీ […]

అల్లూరి కుటుంబ సభ్యులతో భేటీకానున్న ప్రధాని మోడీ
X

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మోడీ సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వస్తారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

అదే సమయంలో అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులలో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అల్లూరి సోదరుడు, సోదరి మనవళ్లు, ముని మనవళ్లు.. అలాగే అల్లూరి సైన్యంలోని కీలక వ్యక్తుల కుటుంబీకులు మొత్తం 37 మందిని అధికారులు గుర్తించారు. వీరిని ప్రధాని మోడీకి పరిచయం చేయనున్నారు. మొదట సభా వేదికపైకే వీరిని తీసుకెళ్లి పరిచయం చేయించాలని భావించారు. కాగా, వేదికపై ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణం రాజు వంటి ముఖ్యులు ఉండటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.

విశాఖ జిల్లా పాండ్రంగిలో అల్లూరి 1897 జూలై 4న జన్మించారు. ఆయన పోరాటం కూడా మన్యంలోనే సాగింది. అయితే చిన్నప్పుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆయన చదువుకున్నారు. భీమవరం దగ్గర్లో ఉన్న కొవ్వాడ, వెంప, మోగల్లు, నరసాపురం ప్రాంతాల్లో ఆయన నివసించారు. భీమవరం మండలం కొవ్వాడలో పినతల్లి అప్పల వెంకటనరసమ్మ దగ్గర ఉంటూ.. పట్టణంలోని లూథరన్ పాఠశాలలో చదివినట్లు పూర్వికులు చెప్తున్నారు. ఆ తర్వాత రాజమండ్రిలో కొంత కాలం చదువుకున్నారు. అందుకే భీమవరంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.

First Published:  2 July 2022 10:31 PM GMT
Next Story