Telugu Global
MOVIE UPDATES

సగంలో ఆగిన సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి..!

ప్రతి వారం ఎన్నో సినిమాలు ప్రారంభమౌతుంటాయి. అందులో కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. అలా ఆగిపోయిన సినిమాల పనంతే. మళ్లీ తెరపైకి రావు. కానీ ఇక్కడో సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. 5 ఏళ్ల కిందట ఆగిన సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. షూటింగ్ కూడా జరుపుకుంటోంది. నాగశౌర్య కెరీర్ లో జరిగింది ఈ వింత. అతడు సగం నటించి ఆపేసిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమా తిరిగి మొదలైంది. నాగశౌర్య, మాళవిక నాయర్ […]

సగంలో ఆగిన సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి..!
X

ప్రతి వారం ఎన్నో సినిమాలు ప్రారంభమౌతుంటాయి. అందులో కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. అలా ఆగిపోయిన సినిమాల పనంతే. మళ్లీ తెరపైకి రావు. కానీ ఇక్కడో సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. 5 ఏళ్ల కిందట ఆగిన సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. షూటింగ్ కూడా జరుపుకుంటోంది. నాగశౌర్య కెరీర్ లో జరిగింది ఈ వింత. అతడు సగం నటించి ఆపేసిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమా తిరిగి మొదలైంది.

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం మంచి హిట్టయింది. అలాగే ‘నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘ఊహలు గుసగుసలాడే సినిమా హిట్టయింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. హీరోగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు.

గతంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే ఈ సినిమా లాంఛ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ సంస్థకు తోడుగా దాసరి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ కూడా చేరింది. ఈ రెండు సంస్థలు కలిసి సినిమాను పూర్తిచేసి, రిలీజ్ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు లండన్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.

ఐదేళ్ల కిందట ఆగిన తన సినిమా ఇలా సెట్స్ పైకి రావడంతో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అయితే హీరో లుక్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే, ఈ ఐదేళ్లలో శౌర్య బాగా మారిపోయాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు సిక్స్ ప్యాక్ సాధించడంతో ముఖం మారిపోయింది.

First Published:  2 July 2022 10:59 PM GMT
Next Story