Telugu Global
MOVIE UPDATES

టాలీవుడ్ కు కొత్త జానర్ పరిచయం చేస్తున్న దర్శకుడు

టాలీవుడ్ జనాలకు యాక్షన్ జానర్ తెలుసు, కామెడీ జానర్ తెలుసు. సెంటిమెంట్, క్రైమ్, హారర్, సస్పెన్స్-థ్రిల్లర్.. ఇలా ఎన్నో జానర్లు చూశారు. అన్ని జానర్లు కలిపికొట్టిన సినిమాలు కూడా చూశారు. అయితే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుడు చూడని జానర్ లో తెరకెక్కింది హ్యాపీ బర్త్ డే సినిమా. “ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్ ఉండటం కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో చేసిన సినిమా ఇది. […]

Lavanya happy birthday
X

టాలీవుడ్ జనాలకు యాక్షన్ జానర్ తెలుసు, కామెడీ జానర్ తెలుసు. సెంటిమెంట్, క్రైమ్, హారర్, సస్పెన్స్-థ్రిల్లర్.. ఇలా ఎన్నో జానర్లు చూశారు. అన్ని జానర్లు కలిపికొట్టిన సినిమాలు కూడా చూశారు. అయితే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుడు చూడని జానర్ లో తెరకెక్కింది హ్యాపీ బర్త్ డే సినిమా.

“ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్ ఉండటం కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో చేసిన సినిమా ఇది. సర్రియల్ కామెడీ అనే జోనర్ ఉంది. కానీ తెలుగులో ఇప్పటి వరకూ రాలేదు. కచ్చితంగా కొత్తగా ఉంటుందనిపించింది. అయితే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు ఉండకుండా ఈ సినిమా జోనర్ గురించి ప్రొమోషనల్ మెటిరియల్ లో ముందే వివరంగా చెప్పాం. కథ మొత్తం లాజికల్ గానే ఉంటుంది. అయితే కథ జరిగే ప్రపంచం మాత్రం ఊహజనితంగా ఉంటుంది.”

ఇలా హ్యాపీ బర్త్ డే సినిమాతో ఓ కొత్త జానర్ పరిచయం చేస్తున్నట్టు ప్రకటించాడు దర్శకుడు రితేష్ రాణా. ఈ సినిమాలో అన్ని రకాల కామెడీలు ఉంటాయంటున్నాడు ఈ దర్శకుడు. పేరడీ, వ్యంగ్యం, పంచ్ కామెడీ, విజువల్ కామెడీ, డైలాగ్ కామెడీ.. ఇలా చాలా రకాల కామెడీలు ఉంటాయన్నాడు.

లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  3 July 2022 1:12 AM GMT
Next Story